వీడిన మిస్టరీ! అది భారత్‌ PSLV రాకెట్‌ భాగమే: ఏఎస్‌ఏ స్పష్టీకరణ

గతకొంతకాలంగా ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు ఎక్కడినుంచి వచ్చిందనే మ్యాటర్ అప్పట్లో మిస్టరీగా మారింది. ఇవాల్టితో దాని మిస్టరీని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేధించారు. ఈ వస్తువు భారత్‌కు చెందిన రాకెట్‌దేనని ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ (ASA) అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమీపంలో జూలై వారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

New Update
వీడిన మిస్టరీ! అది భారత్‌ PSLV రాకెట్‌ భాగమే: ఏఎస్‌ఏ స్పష్టీకరణ

జూలై 15న పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్‌లోని బీచ్ (Australia Green Beach) సమీపంలో ఈ వస్తువు కనిపించింది. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి (ISRO) చెందిన రాకెట్‌లోని పార్ట్ అయి ఉంటుందని కొందరు భావించారు. అంతేకాదు ఇది ఖచ్చితంగా చంద్రయాన్‌-3కి చెందిన శకలం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు ఇంకొందరు తొమ్మిదేళ్ల కిందట అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ MH-370 విమానందేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియన్‌ స్పేస్‌ ఏజెన్సీ దానిని అధ్యయనం చేసి సోమవారం (31-07-2023) రోజున ఒక ప్రకటన చేసింది.

PSLVకి చెందిన శకలమని ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ స్పష్టీకరణ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంఛ్‌ వెహికిల్‌ (PSLV)కి చెందిన శకలమని అధికారులు ప్రకటించారు. అయితే అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోకి లోబడి ఇరు దేశాలు సంయుక్త ప్రకటన వెలువరించాల్సి ఉందని ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ చెబుతోంది. అయితే తాము పరిశీలించిన తర్వాతే ప్రకటన చేస్తామని ఇస్రో ఇదివరకే ప్రకటించగా ఇక అది ఎప్పటిది అనే దానిపై ఇస్రో అధికారులే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

గతంలోనూ ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చిన శకలాలు

PSLV ప్రయోగ దశల్లో ఇలా శలాలను సముద్రంలో పడేయడం సాధారణంగా జరిగేదే. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తీరానికి ఇలాంటి స్పేస్‌ జంక్‌ కొట్టుకురావడం ఇదేం తొలిసారి కాదు. గత ఆగష్టులోనూ ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ శకలం న్యూసౌత్‌వేల్స్‌లోని ఓ గడ్డి మైదనాంలో పడగా ఓ గొర్రెల కాపరి దానిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు