/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sucide-jpg.webp)
Khammam : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో విషాదం నెలకొంది. మనస్తాపంతో ఇంటర్మీడియట్ విద్యార్థిని(Intermediate Student) వాకదాని వైశాలి(17) దారుణానికి పాల్పడింది. ఖమ్మంలోని రెజొనెన్స్ కళాశాలలో మొదటిసంవత్సరం ఎంపీసీ చదువుతున్న వైశాలి(Vaishali).. ఉదయం వెల్లడైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలతో(Intermediate Exam Results) తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య(Suicide) చేసుకుంది. సంస్కృతం సహా మ్యాథ్స్ 1A , 1B పరీక్షల్లో ఫెయిల్ కావడంతో పరువు పోయినట్లు భావించి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. వైశాలి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.