/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-39-6.jpg)
AP News: ఏపీలో మరో యువతి మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. విజయవాడ పాయకాపురంలోని రాధా నగర్ లో ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో ఉంటున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సుంకర లక్ష్మి (16) శనివారం ఉదయం హాస్టల్ నుండి కాలేజీకి వెళ్తానని హాస్టల్ వార్డెన్ చెప్పి మళ్లీ తిరిగి రాలేదు. సాయంత్రం గడుస్తున్న హాస్టల్ కు రాకపోవడంతో కాలేజ్ కి వెళ్లిన వార్డెన్ కళాశాల సిబ్బందిని అడగగా రాలేదని చెప్పారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు వార్డెన్ సమాచారం అందించగా విద్యార్థిని తల్లి గునమ్మ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలింపు చర్యలు మొదలుపెట్టారు.