Health Tips: నోటి క్యాన్సర్‌ను నివారించే మార్గాలు..వెంటనే పరిష్కారం నోటి క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలు పొగాకు వాడకం, అతిగా మద్యం సేవించడమని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం మానేయడం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.తమలపాకులు ఆరోగ్యానికి మంచివే అయినా పాన్ మసాలా మొదలైన వాటిని నమలడం మానుకోవాలంటున్నారు. By Vijaya Nimma 14 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Tips: నోటి క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ నెలగా జరుపుకుంటారు. నోటి క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలు పొగాకు వాడకం, అతిగా మద్యం సేవించడం. నోటి క్యాన్సర్‌ను నివారించే మార్గాలు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ధూమపానం మానేస్తే నోటి క్యాన్సర్ తగ్గుతుందా? 80 నుంచి 90శాతం నోటి క్యాన్సర్ రోగులలో ధూమపానం అనేది సాధారణ కారణం. ధూమపానం మానేయడం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. 25 ఏళ్ల పాటు పొగ తాగిన వ్యక్తి మానేసినా అవి శరీరంలోనే ఉండి చెడు ప్రభావం చూపుతాయి. అదే సమయంలో పూర్తిగా ఆపడం వలన ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని చెబుతున్నారు. కానీ ధూమపానం మానేసిన తర్వాత సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు వైద్యుడిని సంప్రదిస్తే ప్రమాదాన్ని ముందుగానే నివారించవచ్చు. ఆహారంలో మార్పులు నోటి క్యాన్సర్‌కు కారణమా..? స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు. కానీ దీన్ని నిరూపించడానికి సరైన అధ్యయనం లేదు. బీన్స్, బెర్రీ, ఆకులు, అవిసె గింజలు, వెల్లుల్లి, ద్రాక్ష, గ్రీన్ టీ, సోయా, టొమాటోలు వంటి పీచు కూరగాయలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్‌ను నివారించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. నోటి పరిశుభ్రత నోటి క్యాన్సర్‌ను నిరోధించగలదా..? నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం. రోజూ రెండుసార్లు క్రమం తప్పకుండా పళ్ళు తోముకోవడం చాలా మంచిది. అనారోగ్యకరమైన నోరు జెర్మ్స్ మరియు ఇన్ఫెక్షన్లకు నిలయంగా మారుతుంది. హ్యూమన్ పాపిల్లోమావైరస్ ఇన్ఫెక్షన్ అనేది నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ఒకటి. తమలపాకులు నోటి క్యాన్సర్‌కు కారణం అవుతాయా..? తమలపాకు భారతదేశంలో నోటి క్యాన్సర్‌కు అత్యంత సాధారణ కారణంగా నిపుణులు చెబుతున్నారు. తమలపాకులు ఆరోగ్యానికి మంచివే అయినా పాన్ మసాలా మొదలైన వాటిని నమలడం మానుకోవాలని వైద్యులు అంటున్నారు. పొగాకు నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందా..? పొగాకు వినియోగదారులు ఎక్కువగా నోటి క్యాన్సర్ బారిన పడతారు. ముఖ్యంగా పాన్ తినేవారు నోటి క్యాన్సర్‌లకు గురయ్యే ప్రమాదం ఉంది. నోటి క్యాన్సర్‌కు వ్యాక్సిన్ ఉందా..? హ్యూమన్ పాపిల్లోమావైరస్ ముఖ్యంగా HPV16, నోటి వెనుక క్యాన్సర్‌లతో సంబంధాలు కలిగి ఉంటుంది. 11 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి HPV వ్యాక్సిన్ ఉంది. HPVకి ప్రస్తుతం రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి.ఈ టీకాలు వేయడం వల్ల కాలక్రమేణా ఈ క్యాన్సర్‌ల సంఖ్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: మజ్జిగ మంచిదే అయినా ఈ వ్యాధులు ఉంటే అస్సలు తాగొద్దు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #health-benefits #oral-cancer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి