MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలో ఎడమ చేయి మధ్య వేలుకు సిరా గుర్తు.. ఎందుకంటే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రేపు జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఎడమచేయి చూపుడు వేలుకు సిరా గుర్తు వేసినందున.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలుకు సిరా గుర్తు వేయనున్నారు. By B Aravind 26 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana MLC Elections: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రేపు ఉదయం 8.00 AM గంటల నుంచి సాయంత్రం 4.00 PM గంటల వరకు జరగనుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 118 పోలింగ కేంద్రాలు ఉండగా.. సిద్దిపేట జిల్లాలో అత్యల్పంగా కేవలం 5 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారందిరికీ ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు వేసిన సంగతి తెలిసిందే. Also Read: డ్రగ్స్ కేసుల్లో ఎవరినీ వదలొద్దు.. సీఎం రేవంత్! అయితే ఈ సిరా గుర్తు ఇంకా చెరిగిపోలేదు. అందుకే ఈ గ్రాడ్యుయోట్ ఎమ్మెల్సీ ఎన్నిక్లలో ఎడమ చేయి మధ్య వేలికి సిరా గుర్తు వేయనున్నారు. బ్యాలెట్ పత్రాలపై ఉండే అభ్యర్థులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండంగా నిన్నటితో ఈ ఎన్నికల ప్రచార సమయం ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ (BRS) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 4.63 లక్షల మంది పట్టభద్రులు (Graduates) ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. మరి ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. Also read: నకిలీ విత్తనాల గుట్టు రట్టు.. అదుపులో ఇద్దరు నిందితులు! #telugu-news #telangana-news #graduate-mlc-elections #mlc-elections #ink మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి