Shreyas Iyer: అబద్ధాలు ఆడి అడ్డంగా దొరికిన శ్రేయస్ అయ్యర్.. ఇలాంటి ఆటగాళ్లని ఏం చేయాలి? రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఆడకుండా తప్పించుకునేందుకు తనకు వెన్ను నొప్పి ఉందని అయ్యర్ అబద్ధం చెప్పాడని ఎన్‌సీఏ అధికారులు బీసీసీఐకి రిపోర్ట్ చేశారు. దీంతో అయ్యర్‌పై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్యాపీగా ఐపీఎల్ ఆడుకోవచ్చని అయ్యర్ ప్లాన్ చేసినట్టు సమాచారం. By Trinath 22 Feb 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Shreyas Iyer Lies: కొంతమంది టీమిండియా ఆటగాళ్లు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. బద్ధకం ఎక్కువై అబద్ధాలు ఆడుతున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే దేశవాళి మ్యాచ్‌లను ఎగ్గొడుతున్నారు. జ్వరమొచ్చిందని,, గాయమైందని సాకులు చెప్పి రంజీలు ఆడకుండా బయట ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఇదే పని చేసి అడ్డంగా బుక్కయ్యాడు. బీసీసీఐకి అయ్యర్ డ్రామాలు అర్థమైపోయాయి. అసలేం జరిగిందంటే? ఐపీఎల్ ఆడాలంటే రంజీలు ఆడాలని బీసీసీఐ ఇటివలే కండీషన్ పెట్టింది. భారత్ జట్టులో ఉండని ఆటగాళ్లు కనీసం నాలుగు రంజీ మ్యాచ్‌లు ఆడితేనే ఐపీఎల్‌లో ఆడిస్తామని రూల్ పెట్టింది. ఇషాన్ కిషన్ రంజీలు ఆడకుండా పాండ్యాతో కలిసి ఐపీఎల్ కోసం ప్రాక్టిస్ చేయడాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. ఇలాంటి డ్రామాలకు చెక్ పెట్టేందుకు కొత్త రూల్ తీసుకురాగా.. అయ్యర్ అది పాటించకపోగా అబద్ధం చెప్పాడు. గాయమైందని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేశారు. అయితే ఎన్‌సీఏ మాత్రం అయ్యర్‌కు ఎలాంటి గాయం కాలేదని.. అతను ఫిట్‌గానే ఉన్నాడని నివేదికను సబ్మిట్ చేసింది. దీంతో బీసీసీఐకి మండిపోయింది. కావాలనే పక్కన పెట్టారా? టీమిండియాలో చోటు లేని ఆటగాళ్లు రంజీలు ఆడాలని బీసీసీఐ చెప్పడంతో అయ్యర్ గాయం డ్రామా ఆడినట్టు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైన అయ్యర్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. మూడు, నాలుగు, ఐదు టెస్టుల కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో అయ్యర్‌కు చోటు దక్కలేదు. గాయమైందని బీసీసీఐ చెప్పుకొచ్చింది. అయితే నిజానికి అయ్యర్ పెలవమైన ఆటతీరు కారణంగా అతడిని పక్కన పెట్టింది. ఈ విషయాన్ని అయ్యర్‌కు ముందుగానే చెప్పింది. టెస్టు టీమ్‌లో తన స్థానం గల్లంతైన విషయం అర్థమైన తర్వాత ఎక్కడ రంజీలు ఆడాల్సి వస్తుందోనని అయ్యర్ గాయం డ్రామా ఆడి సైలెంట్‌గా సైడ్ అయిపోయాడు. రంజీ ట్రోఫీలో ముంబై క్వార్టర్స్‌కు వెళ్లింది. అయినా అయ్యర్ ఆడడం లేదు.. ఎందుకంటే ఫేక్ గాయం డ్రామాలో బిజీగా ఉన్నాడు. హ్యాపీగా ఐపీఎల్ ఆడుకోవచ్చని అయ్యగారు ప్లాన్ చేసుకున్నారు. Also Read: నాసాలో ఉద్యోగం కావాలా? చదువు అవసరం లేదు..ఈ ఒక్క పని వస్తే చాలు..!! WATCH: #cricket #shreyas-iyer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి