Gannavaram Airport : పొగమంచు ఎఫెక్ట్‌.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానాలు

కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో.. హైదరాబాద్, చెన్నై గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ సేఫ్ ల్యాండింగ్‌ అవుతాయా తిరిగి వెళ్లిపోతాయా అనేదానిపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

New Update
Gannavaram Airport : పొగమంచు ఎఫెక్ట్‌.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానాలు

Fogg Effect : కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు(Gannavaram Airport) లో దట్టమైన పొగ మంచు(Fogg Effect) కమ్మేసింది. దీంతో హైదరాబాద్‌(Hyderabad), చెన్నై(Chennai) నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానాలు(Indigo Planes) గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అరగంట సేపు నుంచి గాల్లో రెండు ఇండిగో విమానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సేఫ్‌ ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇప్పటికే 10 సార్లు విమానశ్రయం చుట్టు గాల్లో విమానాలు చక్కర్లు కొట్టాయి. అయితే గన్నవరం ఎయిర్‌పోర్టులో హైదరాబాద్‌ నుంచి ఇండిగో విమానాలు సేఫ్‌ ల్యాండి అవుతాయా లేదా తిరిగి హైదరాబాద్‌ వెళ్తాయా అనే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Also Read : గర్భిణీపై గ్యాంగ్‌ రేప్‌.. ఆ తర్వాత కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండగులు

ఇటీవల కూడా వాతావరణం అనుకూలించగా పొగ మంచు కమ్మేయడంతో విమానాలు గాల్లో చక్కర్లు కొట్టిన ఘటనలు జరిగాయి. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణిళుకులు భయాందోళనకు గురయ్యారు. ఇండిగో సంస్థకు చెందిన ఏటీఆర్ 72-600(ATR 72-600) అనే విమానం హైదరాబాద్‌ నుంచి బయలుదేరింది. ఉదయం 11 గంటలకు గన్నవరం విమానశ్రయానికి చేరుకుంది. అయితే రన్‌వేపై విమానం దిగేందుకు దగ్గరికి వచ్చిన సమయంలో పైలట్లు ఒక్కసారిగా గాల్లో లేపారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Also Read : పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్‌ కేసు!

Advertisment
Advertisment
తాజా కథనాలు