Gannavaram Airport : పొగమంచు ఎఫెక్ట్‌.. గన్నవరం ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొట్టిన విమానాలు.. చివరికి

ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు వల్ల వాతావణం అనుకూలించకపోవడంతో.. గాల్లోనే విమానాలు చక్కర్లు కొట్టాయి. ఎనిమిది రౌండ్ల పాటు చక్కర్లు కొట్టిన అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.

New Update
Gannavaram Airport : పొగమంచు ఎఫెక్ట్‌.. గన్నవరం ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొట్టిన విమానాలు.. చివరికి

Indigo Planes : ఏపీ(AP) లోని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు(Gannavaram Airport) లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్‌(Chennai - Hyderabad) ల నుంచి వచ్చిన ఇండిగో విమానాలు(Indigo Planes) గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ దట్టమైన పొగమంచు వల్ల వాతావణం అనుకూలించకపోవడంతో.. గాల్లోనే విమానాలు చక్కర్లు కొట్టాయి. ఎనిమిది రౌండ్ల పాటు చక్కర్లు కొట్టిన అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.

Also Read:  బడ్జెట్‌ సమావేశాల్లో 146 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్స్ ఎత్తివేత..!

భయాందోళనకు గురైన ప్రయాణికులు

ఇదిలా ఉండగా... మంగళవారం రోజున హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణిళుకులు భయాందోళనకు గురైన ఘటన జరిగింది. ఇండిగో సంస్థకు చెందిన ఏటీఆర్ 72-600 అనే విమానం హైదరాబాద్‌ నుంచి బయలుదేరింది. ఉదయం 11 గంటలకు గన్నవరం విమానశ్రయానికి చేరుకుంది. అయితే రన్‌వేపై విమానం దిగేందుకు దగ్గరికి వచ్చిన సమయంలో పైలట్లు ఒక్కసారిగా గాల్లో లేపారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఆ కారణం వల్లే

ఐదు నిమిషాల్లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రన్‌వే(Runway) పై ల్యాండింగ్ అయ్యే ప్రాంతం కంటే కంటే ముందుకు విమానం రావడంతో.. పైలట్లు భద్రతా ప్రమాణాల్లో భాగంగా వెంటనే టేకాఫ్ తీసుకున్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. అయితే ఇదే విమానంలో మజీ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కూడా ఉన్నారు.

Also Read: జార్ఖండ్‌ సీఎంగా కల్పనా సోరెన్‌?.. హేమంత్‌ సోరెన్‌ అరెస్టు ఖాయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు