Indigo Flight: హనీమూన్‌ కి ఆలస్యం అవుతుందనే పైలట్‌ పై దాడి చేసిన ప్రయాణికుడు!

ఇటీవల ఇండిగో విమానం పైలట్‌ పై ప్రయాణికుడు దాడి చేయడం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొగమంచు వల్ల విమానం ఆలస్యంగా నడుస్తుండడంతో హనీమూన్ ఆలస్యం అవుతుందనే కోపంతోనే సాహిల్ అనే వ్యక్తి పైలట్ పై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.

New Update
Indigo Flight: హనీమూన్‌ కి ఆలస్యం అవుతుందనే పైలట్‌ పై దాడి చేసిన ప్రయాణికుడు!

Indigo Flight: కొత్తగా పెళ్లయ్యింది. హానీమూన్‌ కోసం గోవాకు వెళ్లేందుకు బోలేడు ప్లాన్స్‌ వేసుకున్నాడు. ఎన్నో ఆశలతో విమానం ఎక్కాడు. ఇంతలో పొగ మంచు వల్ల విమానం ఆలస్యంగా నడుస్తున్నట్లు పైలట్లు ప్రకటించారు. అప్పటికీ చాలా సేపటి నుంచి ఓపికతో ఉండగా..మరోసారి కొత్త పైలట్లు వచ్చి విమానం ఇంకో గంట ఆలస్యంగా నడుస్తుందని చెప్పారు.

హనీమూన్‌ కు ఆలస్యం..

అంతే ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. పైలట్‌ చెంప చెళ్లుమంది. విమానం ఆలస్యం కావడంతో ఇండిగో కో పైలట్‌ పై ప్రయాణికుడు చేయి చేసుకున్న విషయం గత రెండు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పై చాలా మంది సీరియస్‌ అయ్యారు. అయితే ఆ యువకుడు అసలు చేయి చేసుకోవడానికి గల కారణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. హనీమూన్‌ కు ఆలస్యం అవుతుండడంతోనే సదరు ప్రయాణికుడు కోపంతో ఇలా చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

అసలేం జరిగిందంటే..గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కారణంగా చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాకు వెళ్లే ఇండిగో విమానం కూడా చాలా ఆలస్యంగా బయల్దేరింది.

మధ్యాహ్నం 3  అయినా..

ఉదయం 7. 40 గంటలకు బయల్దేరాల్సిన విమానం మధ్యాహ్నం 3 గంటలు అయినా విమానాశ్రయం నుంచి కదల్లేదు. కారణం పొగమంచు. డీజీసీఏ నిబంధనల ప్రకారం..డ్యూటీ టైమింగ్స్‌ ముగియడంతో అప్పటి దాకా విమానంలో ఉన్న పైలట్లు కిందకి దిగిపోయారు. కొత్త పైలట్‌లు డ్యూటీలోకి వచ్చారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగా డ్యూటీలోకి వచ్చిన పైలట్‌..విమానం బయల్దేరడానికి మరో గంట లేట్‌ అవుతుందని తెలిపారు.

ఈ క్రమంలోనే అదే విమానంలో సాహిల్‌ కటారియా అనే వ్యక్తి హనీమూన్‌ కు గోవా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుని విమానం ఎక్కాడు. అయితే ఉదయం 7 .30 గంటలకు వెళ్లాల్సిన విమానం ఉన్న చోట నుంచి కదలకపోవడంతో పాటు మధ్యాహ్నం 3 గంటలు అయినా కూర్చున్న చోట నుంచి విమానం కొంచెం కూడా కదలకపోవడంతో సాహిల్‌ కోపం తారాస్థాయికి చేరుకుంది.

కొత్త భార్యతో సరదాగా ఎంజాయ్‌ చేయాలని ఎన్నో కలలు కన్న అతనికి..రోజంతా విమానంలోనే గడవడంతో ఆవేశంలో ఉన్న అతనికి విమానం మరో గంట ఆలస్యంగా నడుస్తుందని చెప్పడంతో గోవా ప్లాన్‌ మొత్తం బెడిసి కొట్టడంతో తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్‌ లో వెనుక ఉన్న సాహిల్‌ ఒక్కసారిగా పరిగెత్తుకుని వచ్చి పైలట్‌ పై దాడికి దిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Also read: అయోధ్య రామ మందిర వేడుక పై గాయని చిత్ర సోషల్ మీడియా పోస్ట్‌.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గాయని!

Advertisment
Advertisment
తాజా కథనాలు