Indian World Film Festival : ‘మంగళవారం’ దర్శకుడికి ఉత్తమ డైరెక్టర్ అవార్డు!

8వ ‘ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో దర్శకుడు అజయ్ భూపతికి అరుదైన గౌరవం దక్కింది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘మంగళవారం’ సినిమాకుగానూ ఉత్తమ డైరెక్టర్ అవార్డు లభించింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు అజయ్.

New Update
Indian World Film Festival : ‘మంగళవారం’ దర్శకుడికి ఉత్తమ డైరెక్టర్ అవార్డు!

Ajay Bhupathi : ‘ఆర్‌ఎక్స్‌ 100’(RX 100) ఫేమ్, స్టార్ డైరెక్టర్ అజయ్ భూపతి అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. తాను తెరకెక్కించిన మూడో సినిమాకే ఉత్తమ డైరెక్టర్ గా మన్ననలు అందుకుని ఔరా అనిపించాడు. ఈ మేరకు కార్తికేయ(Karthikeya), పాయల్ రాజ్ పుత్(Payal Rajput) జంటగా ‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా భారీ క్రేజ్‌ సొంతం చేసుకున్న అజయ్.. 8వ ‘ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (Indian World Film Festival) అవార్డుకు ఎంపికయ్యారు.

Also Read : ‘ఒసేయ్ అరుంధతి’.. ఆకట్టుకుంటున్న టైటిల్ సాంగ్ పోస్టర్!

గ్రామం చుట్టూ అల్లుకున్న కథ..
ఈ మేరకు గోదావరి జిల్లా(Godavari District) లోని ఓ గ్రామం చుట్టూ అల్లుకున్న కథతో పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘మంగళవారం’(Mangalavaaram) సినిమాకు గాను ఆయన ఉత్తమ డైరెక్టర్ అవార్డు దక్కించుకున్నారు. అయితే ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తంచేసిన అజయ్.. జ్యూరీకి ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. ‘మినీ బాక్సాఫీస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌’లో ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఒకటి. కాగా ‘జైపుర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఉత్తమ నటి, బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌, బెస్ట్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది. ఇక గతేడాది నవంబరులో విడుదలైన 'మంగళవారం' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు