Australia: నాలుగేళ్ల తర్వాత విదేశం నుంచి ఇంటికి.. అంతలోనే

ఆస్ట్రేలియాలో ఓ భారతీయ యువతి మృతి చెందింది. నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇంటికి వచ్చేందుకు మెల్‌బోర్న్‌లోని క్వాంటస్‌ విమానాన్ని ఏక్కేందుకు తుల్లామరైన్ అనే ఎయిర్‌పోర్టుకు వచ్చింది. విమానం ఎక్కి సీట్‌ బెల్ట్‌ పెట్టుకుంటుండగా.. అస్వస్థకు గురై ప్రాణాలు విడిచింది.

New Update
Australia: నాలుగేళ్ల తర్వాత విదేశం నుంచి ఇంటికి.. అంతలోనే

ఈ మధ్యకాలంలో విదేశాల్లో భారతీయులు చనిపోతున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని మరో భారతీయ యువతి మృతి చెందింది. నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇంటికి వచ్చేందుకు బయలుదేరిన ఆమె ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రాణాలు విడిచింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్‌ కౌర్ (24) నాలుగేళ్ల తర్వాత ఇంటికి వచ్చేందుకు మెల్‌బోర్న్‌ నుంచి న్యూ ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్‌లోని క్వాంటస్‌ విమానాన్ని ఏక్కేందుకు తుల్లామరైన్ అనే ఎయిర్‌పోర్టుకు వచ్చింది. అక్కడే ఆమె అస్వస్థకు గురైంది.

Also Read: విద్యార్థితో టీచర్‌ లైంగిక సంబంధం.. చివరికి

ఆ తర్వాత విమానం ఎక్కి సీట్‌ బెల్ట్‌ పెట్టుకుంటుండగా.. అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. విమాన సిబ్బంది, అత్యవసరం వైద్య సేవలు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఆమె కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతోందని  ఆమె స్నేహితుడు అక్కడి మీడియాకు తెలిపాడు. జూన్‌ 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also read: కవితకు బిగ్‌ షాక్‌.. బెయిల్ నిరాకరణ

Advertisment
Advertisment
తాజా కథనాలు