The Rise Music Publishing In India Survey:యూట్యూబ్‌లో టాప్ 10లో 7 మన పాటలే..

మ్యూజిక్ ప్రపంచాన్నేలుతోంది. అందులోని మన ఇండియన్ పాటలు టాప్‌లో నిలుస్తున్నాయి. ఇదేదో అంచనాగా చెప్పింది కాదు. ది రైజ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా 2023 సర్వేలో వెలుగు చూసిన నిజాలు. యూట్యూబ్‌లో టాప్ 10పాటల్లో 7 భారతీయ పాటలే ఉన్నాయి.

New Update
The Rise Music Publishing In India Survey:యూట్యూబ్‌లో టాప్ 10లో 7 మన పాటలే..

సంగీతం మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది...ఉత్తేజాన్నిస్తుంది. అయితే ఒకప్పుడు దీన్ని కేవలం హాబీ కిందనే చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మ్యూజిక్ ఇప్పుడు ఆదాయవనరుగా కూడా మారింది. ఎందరో దీన్ని ఆసరాగా చేసుకుని మంచిగా సంపాదిస్తున్నారు. ఏ ఆర్ రహ్మాన్ వంటివారు ఆస్కార్‌లు కూడా అందుకుంటున్నారు. 2022 ఏడాదిలో భారతదేశంలో మ్యూజిక్ 12వేల కోట్ల వ్యాపారం సాగించింది అంటేనే తెలుస్తోంది...అది ప్రజల్లో ఎంతగా విస్తరించిందో. ఇది రాను రాను పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు.

Also read:నిరుద్యోగులకు గుడ్‌స్యూస్..ఎయిర్ ఫోర్స్‌లో 3500 జాబ్స్

ది రైజ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా సర్వే..

ది రైజ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా 2023 ఏడాదికి సర్వే నిర్వహించింది. ఇందులో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. ఇవి చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇండియాలో మీడియా ఎంటర్టైన్‌మెంట్ రంగాలలో 2.1 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుంటే అందులో 6శాతం వాటా మ్యూజిక్ ఇండస్ట్రీనే కలిగి ఉంది. 40,000 కంటే ఎక్కువ మంది సంగీత సృష్టికర్తలు ఏటా 20,000-25000 పాటలను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలో ఇప్పటికే ఉన్న పాటలు, మ్యూజిక్‌ రీమిక్స్‌ చేస్తున్నవారిని పరిగణలోకి తీసుకోలేదు. వారిని కూడా కలుపుకుంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు.

గతంలో అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా పేరున్న సంస్థలు విడుదల చేసే మ్యూజిక్‌కే ఆదరణ ఉండేదని, కానీ పెరుగుతున్న టెక్నాలజీతో స్థానికంగా మ్యూజిక్‌ క్రియేట్‌ చేస్తున్న వారి కంటెంట్‌కు సైతం మంచి ఆదరణ లభిస్తోందని సర్వే చెబుతోంది. దీని వలన మ్యూజిక్‌ కంపోజర్లు, లిరిసిస్టులు, సింగర్లకు చెల్లించే డబ్బు 2.5 రెట్లు పెరిగింది. ప్రత్యేకంగా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను క్రియేట్‌ చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నవారు, లైవ్‌షోల ద్వారా అర్జిస్తున్నవారు, డిస్కో జాకీల సంఖ్య కూడా పెరుగుతోందని సర్వే ద్వారా తెలుస్తోంది.

యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న భారతీయ పాటలు..
సంగీతం ప్రపంచాన్నే ఏలుతోంది ఇప్పుడు. భాషతో సంబంధం లేకుండా పాటలను వింటున్నారు. దీనికి ఉదాహరణే...తాజాగా యానిమల్ సినిమాతో పాపులర్ అయిన జమాల్ కుడు సాంగ్. ఇది నిజానికి ఇరానియన్ పాట. కానీ యానిమల్ సినిమా తర్వాత భారత్‌లో విపరీతంగా పాపులర్ అయిపోయింది. లిరిక్స్ తెలియకపోయినా జనాల నోళ్ళల్లో నానిందీ పాట. అన్నింటికన్నా కిక్కిచ్చే విషయం ఏంటంటే యూట్యూబ్‌లో ప్రపంచ టాప్ టెన్ సాంగ్స్‌లో ఏడు మనవే అంట. అందులో రెండు తెలుగు పాటలు కూడా ఉన్నాయి. పుష్ప సినిమాలో రారా సామీ పాట టాప్ ప్లేస్‌లో ఉంది. దీనికి 1.55 బిలియన్ల వ్యూస్ వచ్చాయి. తరువాత ఇంద్రావతి చౌహాన్ పాడిన ఊ అంటావా పాటను 1.52 బిలియన్ల మంది చూశారుట.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay Devarakonda: "లవ్‌ యూ అన్నా".. అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ సర్ప్రైజ్‌ గిఫ్ట్‌..

విజయ్‌ దేవరకొండ హైదరాబాద్ లో తన కొత్త రౌడీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా అల్లు అర్జున్‌ కు గిఫ్ట్‌ పంపగా, బన్నీ‘‘స్వీట్‌ బ్రదర్‌’’ అంటూ స్పందించాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం మరోసారి హైలైట్ అయింది.

New Update
Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda: టాలీవుడ్‌ యూత్ ఐకాన్ అల్లు అర్జున్‌(Allu Arjun), రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ పరిశ్రమలో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న సాన్నిహిత్యాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలిపారు.

Also Read: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

మై స్వీట్‌ బ్రదర్‌..

హైదరాబాద్‌లో తన "రౌడీ" బ్రాండ్ స్టోర్‌ను(Rowdy Brand Store) ప్రారంభించిన విజయ్‌ దేవరకొండ, ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, పిల్లల కోసం బర్గర్లను గిఫ్ట్‌గా పంపారు. ఈ చిన్న సర్ప్రైజ్‌ బన్నీ మనసును గెలుచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ గిఫ్ట్ ఫొటోను షేర్ చేస్తూ, "మై స్వీట్‌ బ్రదర్‌.. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆశ్చర్యపరుస్తూ ఉంటావు. సో స్వీట్‌!" అంటూ అల్లు అర్జున్‌ హృదయపూర్వకంగా స్పందించాడు.

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

ఇది తొలిసారి కాదు ‘పుష్ప 2’ విడుదల సమయంలో కూడా విజయ్‌ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పుష్ప’ టీషర్ట్‌లు బన్నీకి పంపిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అల్లు అర్జున్‌ ఆనందంతో, ‘‘నా స్వీట్‌ బ్రదర్‌.. నీ ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ అభినందించాడు. దీనికి విజయ్‌ దేవరకొండ ‘‘లవ్ యూ అన్నా.. మన స్నేహం ఇలానే కొనసాగుతుంది’’ అని రిప్లై ఇచ్చాడు.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న భారీ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు, దీనిని గౌతమ్‌ తిన్ననూరి డైరెక్ట్‌ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment