IND vs ENG : బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్..టీమ్‌లో ఇద్దరు కొత్త ప్లేయర్లు ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లలో భాగంగా ఈరోజు రాజ్‌కోట్‌లో మూడో టెస్ట్ జరుగుతోంది. ఇందులో టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇద్దరు కొత్త ప్లేయర్లు జట్టులోకి అరంగేట్రం చేస్తున్నారు. By Manogna alamuru 15 Feb 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India Vs England Third Test: రాజ్ కోట్ వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌కు అంతా సిద్ధం అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు అయ్యాయి. ఇది మూడవది. హైదరాబాద్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవగా...వైజాగ్‌లో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ గెలిచి చెరొక పాయింట్‌తో సమానంగా ఉంది. ఇప్పుడు ఈ మూడవ దానిలో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఆధిక్యంలోకి వస్తారు. దీని కోసం రెండు టీమ్‌లూ పోటీ పడుతున్నాయి. భారత్ కష్టనష్టాలు... మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది టీమ్ ఇండియా. రెండ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, బుమ్రాల మ్యాజిక్ తో మ్యాచ్ గెలిచి సీరీస్ సమం చేసింది. అయితే భారత్‌లో మిడిల్ ఆర్డర్ సమస్య మాత్రం ఇంకా అలానే ఉంది. విరాట్ మొత్తానికే మ్యాచ్‌లకు రావడం లేదని బీసీసీఐ చెప్పేసింది. దాంతో పాటూ కె. ఎల్ రాహుల్ (KL Rahul) కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ లేడు. దీంతో బ్యాటింగ్ లైనప్‌తో ఇబ్బందులు పడుతోంది భారత్. అయితే ఈ మ్యాచ్‌లో ఇద్దరు కొత్త కుర్రాళ్ళను బరిలోకి దింపుతున్నారు. మరి వాళ్ళేమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ (Sarfaraz Khan) , రజత్ పటీదార్‌లు (Rajat Patidar) ఆడుతున్నారు. అయితే యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సూపర్ జోరు మీదుండడం, శుభ్‌మన్ గిల్ కూడా ఫామ్‌ను అందుకోవడం టీమ్‌ఇండియాకు కాస్త ఊరటనిచ్చే విషయాలు. Also Read:Telangana:నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు ఇక బౌలింగ్‌లో బుమ్రా (Jasprit Bumrah) దూకుడు మీదనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా అతను తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడని కోరుకుంటోంది. స్పిన్నర్లు అనుకున్నంతగా రాణించని నేపథ్యంలో సిరీస్‌లో ఇప్పటివరకు భారత్‌ను నిలబెట్టింది అతడి బౌలింగే అనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో బుమ్రాతో పాటూ సిరాజ్(Mohammed Siraj) కూడా ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను పంచుకంటున్నాడు. ఇక స్పిన్నర్ల విభాగంలో అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లు ఉన్నారు. అలాగే వికెట్ కీపర్‌గా ధృవ్ ఉరెల్‌ను తీసుకున్నారు. ఒకే ఒక్క మార్పు.. మరోవైపు ఇంగ్లండ్ ఒక మార్పుతోనే ఈసారి బరిలోకి దిగుతోంది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో వెటరన్ పేసర్ మార్క్ వుడ్ తుదిజట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇద్దరు పేసర్లు జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్‌లను ఆడిస్తోంది. తుది జట్లు.. టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ #cricket #england #india #sarfaraz-khan #india-vs-england #rajat-patidar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి