T20 Series: ఇది కదా మ్యాచ్ అంటే..సపర్ ఓవర్‌లో టీమ్ ఇండియా విజయం

శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించి మరీ సీరీస్ క్లీన్ స్వీప్ చేసింది టీమ్ ఇండియా. సూపర్ ఓవర్‌లో లంక ఇచ్చిన మూడు పరుగుల లక్ష్యాన్ని ఒక బంతిలోనే కొట్టేసి మరీ గెలిచింది.

New Update
T20 Series: ఇది కదా మ్యాచ్ అంటే..సపర్ ఓవర్‌లో టీమ్ ఇండియా విజయం

India VS Srilanka:క్కోసారి క్రికెట్ మ్యాచ్‌లు అద్భుతంగా జరుగుతుంటాయి. ఇది కదా మ్యాచ్ అంటే అన్నట్టు సాగుతాయి. పల్లెకెలెలో జరిగిన శ్రీలంక, ఇండియా మూడో టీ 20 మ్యాచ్ కూడా ఇలాగ అయింది. నరాలు తెగే ఉత్కంఠత మధ్యన భారత కుర్రాళ్లు మరుపు రాని ప్రదర్శన చేశారు. ఓడిపోతున్న మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకొని సూపర్‌ విజయాన్ని సాధించిపెట్టారు. శ్రీలంక గెలు్తుంది అనుకున్న మ్యాచ్‌లో వారిని గెలుపు తీరాలకు చేరకుండా కట్టడి చేశారు. చివర్లో జరిగిన సూపర్‌ ఓవర్‌లో అదరగొట్టడంతో టీమ్‌ ఇండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

పల్లెకెలెలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టాప్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(39), రియాన్‌ పరాగ్‌ (26), వాషింగ్టన్‌ సుందర్‌ (25)లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. దాని తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో లంకకు చిన్న లక్ష్యాన్ని ఇవ్వగలిగారు భారత బ్యాటర్లు. రెండో ఓవర్లో తీక్షణ బౌలింగ్‌లో యశస్వీ(10) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సంజు(0) మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. విక్రమసింఘె వేసిన బంతిని హసరంగకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మూడో ఓవర్లో రింకు సింగ్‌(1) తీక్షణ బౌలింగ్‌లో పతిరణకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ సూర్య(8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. తర్వాత వచ్చిన శివమ్‌ దూబె(13) సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో భారత్‌ 48 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. గిల్, పరాగ్, వాషింగ్న్ సుందర్‌లు కాస్త ఆడారు కాబట్టి ఆ మాత్రం స్కోరు అయినా సాధించగలగారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ 3, హసరంగా 2, విక్రమసింఘే, మెండిస్‌, ఫెర్నాండో ఒక్కో వికెట్‌ తీశారు.

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన లంక 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి భారత్ స్కోర్‌ను సమం చేసింది. మొదటి వికెట్‌కే ఆ జట్టు 58 పరుగులు చేసింది. నిశాంక (26: 27 బంతుల్లో 5 ఫోర్లు), కుశాల్‌ మెండిస్‌ (43: 41 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి కుశాల్‌ పెరీరా (46పరుగులు 34 బంతుల్లో 5 ఫోర్లు)చేసి మ్యాచ్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. అయితే 17వ ఓవర్ నుంచి మ్యాచ్ సమీకరణాలు మారిపోయాయి. లంక వైపు వెళుతున్న గెలుపు టీమ్ ఇండియా వైపు తిరిగింది. 17వ ఓవర్లో వాషింగ్టన్‌ సుందర్‌ మాయ చేశాడు. కేవలం రెండు పరుగులే ఇవ్వడంతో పాటు వరుస బంతుల్లో హసరంగా(3), అసలంక(0)ను ఔట్‌ చేశాడు. అయితే 18వ ఓవర్ల వేసిన కలీల్‌ అహ్మద్‌ ఒకే ఓవర్‌లో 5 వైడ్‌ వేయడంతో పాటు 12 పరుగులు ఇచ్చాడు. దీంతో లంక జట్టు లక్ష్యం రెండు ఓవర్లలో 9 పరుగులుగా మారింది. 19 ఓవర్లో రింకూ సింగ్‌ కుశాల్‌ పెరీరాతో మరో వికెట్‌ తీసి మూడు పరుగులే ఇచ్చాడు. దీంతో ఇరుజట్లలోనూ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. చివరి ఓవర్‌ వేసిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ తొలి మూడు బంతుల్లో పరుగులు ఇవ్వకుండా రెండు వికెట్లు తీశాడు. ఇక లంక లక్ష్యం 3 బంతుల్లో ఆరు పరుగులుగా మారింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. చివరి ఓవర్‌లో నాలుగో బంతికి సింగల్ రాగా, ఐదు, ఆరు బంతులకు రెండు పరుగుల చొప్పున వచ్చాయి. దీంతో స్కోర్‌ సమం అయి మ్యాచ్‌ టై గా మారింది. దీంతో సూపర్‌ ఓవర్‌ పెట్టారు. సూప్ ఓవర్‌లో శ్రీలంక ౩ పరుగులు చేసింది. దానిని భారత బ్యాటర్లు ఒక్క బంతిలోనే ఛేదించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రింకు సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read:మజాలు చేస్తే ఆటలు కట్..ఒలింపిక్స్ నుంచి బ్రెజిల్ స్విమ్మర్ ఔట్

Advertisment
Advertisment
తాజా కథనాలు