T20 World Cup: టీ 20 వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్

సూపర్‌-8లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది టీమ్ ఇండియా. దాంతో పాటూ సెమీస్ బెర్త్‌ను కూడా ఖాయం చేసుకుంది. ఈరోజు బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

New Update
T20 World Cup: టీ 20 వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్

India Vs Bangladesh: ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా టీమ్ ఇండియా సెమీస్‌కు చేరుకుంది. సూపర్ 8లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనే భారత్ విజయం సాధించింది. ఈరోజు బంగ్లాదేశ్‌తో 50 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా జట్టు కెప్టెన్ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. దీంతో మొదటటీమ్ ఇండియా బ్యాటింగ్‌కు దిగింది. దాంతో పాటూ ఈరోజు బ్యాటర్లు అందరూ నిలకడగా ఆడారు. ప్రతీ బ్యార్ కనీసం 30 పరుగులు చేశారు. మరోవైపు హార్దిక్ పండ్యా (Hardik Pandya) ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టి హాఫ్‌ సెచునీ చేయడమే కాకుండా నాటౌట్‌గా నిలిచాడు.'

Also Read: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్..ఐఎండీ హెచ్చరిక

మరోవైపు సూర్యకుమార్ యాదవ్‌ తప్ప కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli), పంత్, శివమ్ దూబే (Shivam Dube) ఇలా అందరూ 30 పరుగులు చేయడంతో టీమ్ ఇండియా 196 పరుగులు లక్ష్యాన్ని బంగ్లా జట్టుకు ఇవ్వగలిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (23; 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్ కోహ్లీ (37; 28 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)షభ్‌ పంత్ (36; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబె (34; 24 బంతుల్లో 3 సిక్స్‌లు) స్కోర్లు చేశారు.

ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ జట్టు విఫలం అయింది. నిర్ణీత ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 146 మాత్రమే చేగలిగింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో (40; 32 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు కట్ట టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టెయిలెండర్ రిషాద్ హొస్సేన్ (24; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. తాంజిద్ హసన్ (29), లిటన్ దాస్ (13), మహ్మదుల్లా (13), షకిబ్ అల్ హసన్ (11) పరుగులు చేశారు. కుల్‌దీప్ యాదవ్ (3/19), జస్‌ప్రీత్ బుమ్రా (2/13) బంగ్లాను దెబ్బకొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్య ఒక వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌తో బంగ్లాదేశ్ జట్టు సెమీస్ రేసు నుంచి తొలగిపోయింది. టీమ్ ఇండియా సూపర్ 8లో భాగంగా చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. సోవారం ఈ మ్యాచ్ జరగనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు