IND vs SA : టీమిండియాకు సఫారీల సవాల్.. తొలి టీ20కు ప్లేయంగ్ టీమ్ ఇదే! రేపటి(డిసెంబర్ 10) నుంచి దక్షణాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలవనుంది. సఫారీ గడ్డపై రేపు సాయంత్రం 7:30నిమిషాలకు ప్రారంభంకానన్న తొలి టీ20లో భారత్‌కు సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. By Trinath 09 Dec 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి India vs South Africa T20 : వరల్డ్‌కప్ ఓటమి బాధను ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ మరిచిపోతున్నారు. ఏదైనా సందర్భం వస్తే కానీ ఆ ఓటమి పెద్దగా గుర్తురావడం లేదు. క్రికెట్ ఫ్యాన్స్‌కి ఈ ఫీలింగ్స్ కామనే. గెలవడం, ఓడడం ఆటలో భాగం. వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడేసింది టీమిండియా. 4-1 తేడాతో ఆసీస్‌ను ఓడించింది. రోహిత్, కోహ్లీ, రాహుల్ లేకుండానే సత్తా చాటింది. సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) కెప్టెన్సీలో కుర్రాలు అదరగొట్టారు. ఆస్ట్రేలియాపై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచే ఓడిపోయారు. అది కూడా చివరి ఓవర్‌లో ప్రసిద్ కృష్ణ చెత్త బౌలింగ్‌తో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఆస్ట్రేలియాపై సిరీస్ గెలుపు తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా ఫ్లైటెక్కింది. రేపటి(డిసెంబర్ 10) నుంచి సఫారీలతో పొట్టు ఫైట్‌కు సై అంటోంది. టీ20ల్లో మనదే డామినేషన్: సౌతాఫ్రికా గడ్డపై భారత్(India) ఆడిన 23 టెస్టుల్లో 4, 56 వన్డేల్లో 22, 13 టీ20ల్లో 8 గెలిచింది. అంటే భారత జట్టు టెస్టు-వన్డేల కంటే ఎక్కువ టీ20లను గెలుస్తోంది. అక్కడ 61.53 శాతం మ్యాచ్ ల్లో జట్టు విజయం సాధించగా, వన్డేల్లో 39.28 శాతం, టెస్టుల్లో 17.39 శాతం మ్యాచ్ లు గెలిచింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20ల్లోనూ భారత్ ప్రదర్శన అద్భుతం. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఆడిన 23 టెస్టుల్లో 4, 37 వన్డేల్లో 10, 7 టీ20ల్లో 5 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై టెస్టుల్లో 17.39 శాతం, వన్డేల్లో 27.02 శాతం, టీ20ల్లో 71.42 శాతం గెలిచింది. తుది జట్లు అంచనా: భారత్ ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ , సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్), రవీంద్ర జడేజా , దీపక్ చాహర్, రవి బిష్ణోయ్ , మహ్మద్ సిరాజ్ , అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్కమ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షమ్సీ Also Read: ‘అది నా హక్కు…’ కోహ్లీతో గొడవ..! గంభీర్ అసలు తగ్గట్లేదుగా! WATCH: #cricket #t20 #suryakumar-yadav #india-vs-south-africa #cricket-association మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి