IND VS SA: నాలుగు వికెట్లు ఢమాల్.. కోహ్లీపైనే భారం!

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తడపడి బ్యాటింగ్‌ చేస్తోంది. 100 పరుగుల లోపే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భారమంతా కోహ్లీపైనే పడనుంది.

New Update
IND VS SA: నాలుగు వికెట్లు ఢమాల్.. కోహ్లీపైనే భారం!

అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దక్షిణాఫ్రికా-ఇండియా మ్యాచ్‌ అసలుసిసలైన టెస్టు ఫ్లేవర్‌ను తలపిస్తోంది. సెంచూరియన్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో ఇండియా తడపడి నిలబడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా లంచ్‌ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.

నిరాశపరిచిన కెప్టెన్:
పేసర్లకు అనుకూలిస్తోన్న పిచ్‌పైకి ఓపెనర్లగా రోహిత్‌ శర్మ(Rohit Sharma), యశస్వీ జైస్వాల్‌ దిగారు. రోహిత్‌ మరోసారి ఫోకస్‌ తప్పాడు. 14 బంతుల్లో 5 పరుగులు చేసిన రోహిత్ అనవసర షాట్ ఆడాడు. రబాడా బౌలింగ్‌లో బర్గర్‌ క్యాచ్‌కు రోహిత్‌ పెవిలియన్‌కు చేరాడు. దీంతో 13 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత టీమ్‌ స్కోరు 23 వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. మంచి టచ్‌లో కనిపించిన యాశస్వీ బర్గర్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 37 బంతుల్లో యశస్వీ 17 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత వెంటనే శుభమన్‌ గిల్‌ ఔట్‌ అయ్యాడు. కేవలం రెండు పరుగులకే బర్గర్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

ఇక ఆ తర్వాత భారత్‌ బ్యాటింగ్‌ భారాన్ని కోహ్లీ, అయ్యర్‌ మోశారు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే లంచ్‌ బ్రేక్‌ తర్వాత భారత్‌కు షాక్‌ తగిలింది. 50 బంతుల్లో 31 రన్స్ చేసి రబాడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక సఫారీ గడ్డపై ఇండియా ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలవలేదు. 31ఏళ్ల నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ ఎప్పుడూ కూడా టెస్టు సిరీస్‌ విజయం సాధించలేదు. అజార్‌, ద్రవిడ్‌, ధోనీ నుంచి కోహ్లీ, రాహుల్ వరకు అందరూ ఈ ఫీట్ సాధించడంలో ఫెయిల్ అయ్యారు. అయితే రోహిత్‌ చరిత్ర సృష్టిస్తాడని.. 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Also Read: అంతా తూచ్‌.. పాండ్యా వస్తున్నాడట.. ఇదెక్కడి లొల్లి భయ్యా!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు