IND VS AUS: తెలుగు కుర్రాడు ఔట్.. బరిలోకి వరల్డ్‌కప్ ఫైనల్ ఫ్లాప్ ప్లేయర్! రాయ్‌పూర్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 1న జరగనున్న నాలుగో టీ20లో రెండు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్, వరుసగా ఫెయిల్ అవుతున్న పేసర్ ప్రసిద్ కృష్ణ స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. By Trinath 01 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఇండియా మరోసారి అదే పొరపాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక ప్లేయర్‌ను ఆడించడం, పక్కన పెట్టడం, తర్వాత మళ్లీ టీమ్‌లోకి తీసుకోవడం, సరిగ్గా ఆడలేదంటూ పక్కన పెట్టడం బీసీసీఐ తరతరాలుగా చేస్తున్న పొరపాటు. మూడు మ్యాచ్‌లు ఆడించారో లేదో తెలుగు కుర్రాడు తిలక్‌వర్మ(Tilak Varma)కు రెస్ట్ ఇవ్వాలని జట్టు యాజమాన్యం ఫిక్స్ ఐనట్టు తెలుస్తోంది. ఇవాళ(డిసెంబర్ 1) జరగనున్న నాలుగో టీ20కి తిలక్‌ను పక్కన పెట్టి వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఫ్లాప్ అయిన ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ని ఆడించనుంది. తొలి మూడు టీ20లకు రెస్ట్‌లో ఉన్న 'అయ్య'గారు నాలుగో టీ20కి వైస్ కెప్టెన్సీ హోదాలో విచ్చేశారు. దీంతో బీసీసీఐపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ సిరీస్ మొత్తానికి అయ్యర్‌కు రెస్ట్ ఇస్తే పోయేదేముందని ప్రశ్నిస్తున్నారు. సిరీస్‌పై భారత్ కన్ను: ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-1 లీడ్‌లో ఉంది. మూడో టీ20లో 222 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోలేకపోయింది టీమిండియా. డ్యూ ఫ్యాక్టర్‌తో పాటు పూర్తిస్థాయి బ్యాటింగ్ ట్రాక్‌లతో బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. అదే సమయంలో బౌలర్లు ఎంత కష్టపడి బౌలింగ్ వేసినా పిచ్ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో భారీగా పరుగులు సమర్పించుంకుంటున్నారు. ఇక మూడు టీ20ల్లో అట్టర్‌ఫ్లాప్ బౌలింగ్ వేసిన పేసర్ ప్రసిద్ కృష్ణకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మూడో టీ20లో ప్రసిద్ నాలుగు ఓవర్లలో 68 రన్స్ ఇచ్చాడు. ఇది టీ20లో భారత్ నుంచి అతి చెత్త టీ20 బౌలింగ్ స్పెల్. #INDvsAUS #TilakVarma Catch🥵🥵 pic.twitter.com/JEP0ajikFW — B.v Rao (@Bvrao999) November 27, 2023 ఈ రెండు మార్పులు మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు కనిపించడంలేదు. ఇవాళ మ్యాచ్ రాయ్‌పూర్‌లో జరగనుంది. ఇది కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కావడంతో మరోసారి పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. అటు వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత కాస్త్ రెస్ట్ తీసుకోని మూడో టీ20లోకి ఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా డేరింగ్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో కదం తొక్కాడు. 48 బంతుల్లోనే 104 రన్స్ చేసి ఆస్ట్రేలియాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లోనూ మ్యాక్సీ వికెట్ భారత్‌కు కీలకం కానుంది. భారత్ జట్టు ప్లేయంగ్-11(అంచనా) యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (wk), సూర్యకుమార్ యాదవ్ (c), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, దీపక్ చహర్ Also Read: రోహిత్, కోహ్లీ లేకుండానే వన్డే, టీ20 టీంలు.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు WATCH: #india-vs-australia #shreyas-iyer #tilak-varma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి