India-Canada: కెనడా పౌరులకు వీసా సేవలు పునరుద్ధరణ.. ఎప్పటినుంచంటే

ఇటీవల భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. కెనడా పౌరుల కోసం వీసా సేవలు పునరుద్దరిస్తున్నట్లు పేర్కొంది. ఎంట్రీ, బిజినెస్, మెడికల్ వీసాలు అలాగే కాన్ఫరెన్స్ వీసాలను జారీ చేస్తున్నట్లు తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటిదాకా వీసా సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని.. వీటిపై సమీక్ష చేసిన అనంతరం ఈ సేవల్ని పునరుద్ధరిస్తున్నామని స్పష్టం చేసింది.

New Update
India-Canada: కెనడా పౌరులకు వీసా సేవలు పునరుద్ధరణ.. ఎప్పటినుంచంటే

ఇటీవల భారత్, కెనడాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు కూడా సంబంధిత దౌత్యవేత్తలను తొలగించడం తీవ్ర దుమారం రేపింది. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్.. కెనడా పౌరులకు వీసా సేవల్ని నిలిపివేసింది. అయితే ఇప్పుడు తిరిగి ఆ సేవలను కెనడా పౌరుల కోసం పునరుద్ధరించింది. ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఇందుకు సంబంధించిన ప్రకటనను అధికారికంగా వెల్లడించింది. ఎంట్రీ, బిజినెస్, మెడికల్ వీసాలు అలాగే కాన్ఫరెన్స్ వీసాలను జారీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇక అక్టోబర్ 26 నుంచి తాత్కాలికంగా ఈ వీసా సేవల్ని ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో భారత్ హైకమీషన్ తెలిపింది. అయితే భద్రతా కారణాల వల్లే ఇప్పటిదాకా వీసా సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని పేర్కొంది. దీనిపై సమీక్ష చేసిన తర్వాత ఈ సేవల్ని పునరుద్ధరిస్తున్నామని స్పష్టం చేసింది.

Also read: కర్ణాటకలో పులిగోరు పంచాయితీ.. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు

ఇదిలాఉండగా.. ఇటీవల ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తముందంటూ కేనడా ప్రధాని జస్టీన్ ట్రూడో చేసిన ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాగే సిక్కుల కోసం ప్రత్యేకంగా ఖలిస్థానీ దేశాన్ని ప్రకటించాలంటూ కెనడాలోని సిక్కు మతస్థులు రోడ్లపై నిరసనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ చివరి వారం నుంచి ఇరు దేశాలు వీసా సేవల్ని నిలిపివేసుకున్నాయి. మరోవైపు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ స్పష్టం చేసింది.

Also Read: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు.. ప్రధాని మోదీకీ ఆహ్వానం..

Advertisment
Advertisment
తాజా కథనాలు