Chandrayan-4: 2028లో చంద్రయాన్ -4 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. 2028లో ఇస్రో చంద్రయాన్ -4 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ మిషన్‌లో చంద్రుని లూనార్ సర్ఫెస్ నుంచి శాంపిల్స్ తీసుకురానుంది. అలాగే 2040 నాటికి భారతీయులను చంద్రునిపైకి పంపనుంది. By B Aravind 28 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి భారత్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3ని విజయవంతం చేసిన (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఇస్రో.. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. 2028లో చంద్రయాన్-4 ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి లూపెక్స్ మిషన్ అని పేరు కూడా పెట్టినట్లు ఇస్రోకి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్(SAC) అసోసియేట్ డైరెక్టర్ డా. నీలేష్ దేశాయ్ తెలిపారు. ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుని ఉపరితలం పైనుంచి రాళ్లను తీసుకువస్తామని.. ఈ మిషన్ విజయవంతం అయితే.. చంద్రుని లూనార్ సర్ఫేస్ నుంచి శాంపిల్స్ తీసుకొచ్చిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటికే ఇస్రో.. 2040కి చంద్రుని పైకి భారతీయులన్ని పంపాలని ప్రణాళికలు చేస్తోందని.. మనుషుల్ని జాబిల్లి పైకి పంపేందుకు మనకు ఇంకా 15 ఏళ్ల సమయం పడుతుందన్నారు. Also Read: ఆ సమస్యను పరిష్కరించండి.. సత్యనాదెళ్లకు ఎలాన్ మస్క్ మెసేజ్ చంద్రునిపై మానవులు నివసించేందుకు దారి 2028లో చేపట్టబోయే చంద్రయాన్-4 మిషన్‌ను.. చంద్రుని సౌత్ పోల్ సమీపంలో ల్యాండ్ చేయనున్నారు. ఇక్కడ నుంచి జాబిల్లిపై ఉండే రాళ్ల శాంపిల్స్‌ను సేకరించి వాటిని తిరిగి భూమి పైకి తీసుకొస్తుంది. ఆ శాంపిల్స్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు. చంద్రనిపై భవిష్యత్తులో మానవులు నివసించేందుకు.. నీరు లాంటి వనరులను గుర్తించేందుకు ఇందుకు సంబంధించిన డేటా ఉపయోపడుతుంది. చంద్రయాన్-4లో 350 కేజీల రోవర్ ఉంటుంది. ఇది చంద్రయాన్-3 రోవర్‌తో పోల్చి చూస్తే చాలా పెద్దది. అలాగే ఇది ఎక్కువ దూరం చంద్రునిపై ప్రయాణిస్తుంది. చంద్రయాన్-3 కి మించి మనదేశానికి చెందిన అత్యంత బరువైన GSLV Mk 3 లేదా LVM3 లాంచ్ వెహికిల్స్‌లలో చంద్రయాన్-4 మిషన్‌ను వినియోగించే అవకాశం ఉంది. చంద్రునిపై శాంపిల్స్‌ని సేకరించి.. మళ్లీ వాటిని భూమి పైకి తీసుకురావాలి కాబట్టి ఇది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఇందుకోసం రెండు ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుంది. జాబిల్లిపై చంద్రయాన్-4 ల్యాండింగ్ అనేది.. చంద్రయాన్-3 లాగే ఉంటుంది. కాకపోతే చంద్రయాన్-4లో సెంట్రల్ మాడ్యూల్.. ఆర్బిటింగ్ మాడ్యూల్ నుంచి విడిపోయాక వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పటికే ఇస్రో.. చంద్రని ఉపరితలం నుంచి స్పేస్‌క్రాఫ్ట్ పైకి లేస్తుందా.. అలాగే ఆర్బిటార్ చంద్రుని నుంచి భూమిపైకి వస్తుందా అనే దానిపై ఓ ప్రయోగాన్ని ప్రదర్శించింది. ఇందులో చంద్రునిపై నుంచి మళ్లీ తిరిగి వచ్చేలా చేసేందుకు సాధ్యమయ్యే అవకాశాలు కనిపించాయి. Also read: 2029 నుంచి జమిలి ఎన్నికలు..! కేంద్రానికి ప్రతిపాదన చేయనున్న లా కమిషన్ #chandrayan-3 #isro #moon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి