M-Pox: ఎయిర్ పోర్ట్, ఆసుపత్రిలో అలెర్ట్..ఎంపాక్స్‌తో వార్‌‌కు సిద్ధం

ప్రపంచాన్ని మరో మహమ్మారి తరుము కొస్తోంది. ఆఫ్రికాలో మొదలైన ఎంపాక్స్ వైరస్ నెమ్మదిగా ఇతర దేశాలకూ పాకుతోంది. దీంతో భారత్ అలెర్ట్ అయింది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రిపేర్ అయింది. ఆసుపత్రులు, ఎయిర్ పోర్ట్‌లలో అలెర్ట్ ప్రకటించింది.

New Update
Thailand: ఆసియాలోకి ఎంటర్ అయిన మంకీ పాక్స్..

Monkey Pox: మంకీ పాక్స్...ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.ఇప్పటికే మంకీపాక్స్‌ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. కాంగోలో ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 500 మందికి పైగా మరణించారు. ఆ దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఉంటే స్వీడన్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కేసులు నమోదయ్యాయి. అందుకే ఈ ఎంపాక్స్ విషయంలో భారతదేశం జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డుల ఏర్పాటుతో పాటు విమానాశ్రయాల్లో అలెర్ట్ ప్రకటించారు. ఇంకా దీనికి సంబంధించిన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని ప్రభుత్వం ఆస్పత్రలకు ఆర్డర్ పాస్ చేసింది. ఢిల్లీలోని మూడు నోడల్ ఆస్పత్రులు-సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్స్ ను ఎంపాక్స్‌ కోసం కేటాయించారు. అనుమానిత రోగులపై RT-PCRతో పాటు నాజిల్ స్వాబ్ పరీక్షలు చేయనున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విమానాశ్రయాలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు.

నిజానికి మంకీ పాక్స్ వైరస్ ఇప్పటిది కాదు. ది ఇంతకు ముందు కూడా ప్రపంచాన్ని భయపెట్టింది. రెండేళ్ళ క్రితం 100కు పైగా దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కూడా 30 కేసులు వెలుగు చూశాయి. అయితే అది తర్వాత తగ్గు ముఖం పట్టింది. పైగా అప్పట్లో ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య కూడా చాలా తక్కువే ఉంది. కానీ ఇప్పుడు ఎంపాక్స్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఒక్క కాంగోలనే 500మంది మరణించారు. ఈ వైరస్ గతంకన్నా శక్తివంతంగా మారిందని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాంతో అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాయి.

Also Read:Jammu-kashmir: జమ్మూ–కాశ్మీర్‌‌లో మళ్ళీ టెర్రర్ అటాక్..పారామిలటరీ ఆఫీసర్ మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు!

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

New Update
horoscope

horoscope

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో తరచూ ఆటంకాలు నిరాశ కలిగిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. మాటలు పొదుపుగా మాట్లాడాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఖర్చులు పెరగవచ్చు.

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రోజులుగా వేధించిన ఆందోళన, ఒత్తిళ్లు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన దానికన్నా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. 

Also Read: Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విఘ్నాలు చికాకు పెడతాయి. ప్రయత్నలోపం లేకుండా చూసుకోండి. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో చేసే పనులు త్వరిత విజయాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఓ కీలక వ్యవహారంలో పురోగతి సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు, ఖ్యాతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. పెట్టుబడుల ద్వారా ఆర్థిక లబ్ది చేకూరుతుంది. పెట్టుబడిదారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు అందుకుంటారు. రుణభారం నుంచి ఉపశమనం పొందుతారు.

కన్యారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సత్వర విజయం ఉంటుంది. మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి పెరుగుతుంది. డబ్బు రాక కూడా పెరుగుతున్న సంకేతాలున్నాయి. స్నేహితుల ద్వారా లబ్ధి పొందుతారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది.

తులారాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రీఘ్ర విజయం ప్రాప్తిస్తుంది. బుద్ధి బలంతో క్లిష్టమైన పనులను కూడా చాలా ఈజీగా పూర్తి చేస్తారు. అవివాహితుల విషయంలో పెళ్లి చర్చలు జరగడానికి ఛాన్స్‌ ఉంది.

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారులు ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఒక శుభవార్త శక్తినిస్తుంది.

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో పనిచేసి కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కొన్ని ఊహించని సంఘటనలు జరగవచ్చు. జీవిత భాగస్వామితో ఘర్షణలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. 

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి. నిరంతర కృషి, పట్టుదలతో తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. 

కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు.

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ప్రారంభించిన పనుల్లో సమస్యలు తలెత్తుతాయి. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. బంధువులతో మనస్పర్థలకు అవకాశముంది. జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. 

Also Read:WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

horoscope | Horoscope 2025 | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment