Cricket: టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ..వన్డే సీరీస్ లంక కైవసం టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా..సీరీస్‌ను కూడా చేజార్చుకుంది. మూడో వన్డేలో ఇండియా 110 పరుగుల తేడాతో ఓడిపోయింది. By Manogna alamuru 07 Aug 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India Vs Srilanka: ఇదే లంక జట్టు మీద కుర్రాళ్ళు టీ20 సీరీస్‌ను అద్భుతంగా గెలిచారు. కానీ సీనియర్లు కూడా ఉన్న వన్డే జట్టు మాత్రం ఓడిపోయింది. మూడు వన్డేల సీరీస్‌ను 0–2 తేడాతో శ్రీలంక ఎగురేసుకుపోయింది. వన్డే మొదలయిన దగ్గర నుంచి మనవాళ్ల ఫెర్ఫామన్స్ దారుణంగా ఉంది. ఒక మ్యాచ్‌ను కష్టపడి టై చేశారు. రెండింటిని లంకేయులకు సమర్పించుకున్నారు. మూడో వన్డే మ్యాచ్‌లో అయితే మరీ దారుణం. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను ఓడిపోయారు. 27 ఏళ్ల తర్వాత భారత్‌పై లంక వన్డే సిరీస్ నెగ్గింది. చివరగా 1997లో అర్జున రణతుంగ కెప్టెన్సీలో శ్రీలంక 3-0తో టీమ్‌ఇండియాను ఓడించింది. కొలంబోలో జరిగిన మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా 138 పరుగులుకే ఆలౌట్ అయింది. అది కూడా 26.1 ఓవర్లలోనే. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 35, వాషింగ్టన్ సుందర్ 30, విరా కోహ్లీ 20, రియాన్ పరాగ్ 15 పరుగులు చేశారు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్లకే పెవిలియన్ బాట పట్టారు. మరోవైపు శ్రీలంక స్పిన్నర్ 27 పరుగులకు 5 ఇకెట్లు తీసి భారత్ బ్యాటర్ల వెన్ను విరిచాడు. మరో స్పిన్నర్ జెఫ్రి వాండర్సే 2, అసిత ఫెర్నాండో, మహీశ్ తీక్షణ తలో వికెట్ పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో పాథుమ్ నిశాంక 45, ఆవిష్క ఫెర్నండో 96 చేయగా...వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండస్ 59లతో రాణించాడు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, కుల్‌దీప్ యాదవ్, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. Also Read: #cricket #india #srilanka #lost #oneday-series మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి