NEET Paper Scam: నీట్‌ పేపర్‌ స్కామ్.. విద్యార్థులకు రాహుల్ కీలక సందేశం

నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోదీ ప్రభుత్వంతో చర్చలు జరడమే ఇండియా కూటమి లక్ష్యమని విపక్ష నేత రాహల్ గాంధీ తెలిపారు. కేంద్రంతో శాంతియుతంగా చర్చలు జరిపేందుకు విపక్ష నేతలందూ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

New Update
NEET Paper Scam: నీట్‌ పేపర్‌ స్కామ్.. విద్యార్థులకు రాహుల్ కీలక సందేశం

లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ విద్యార్థులనుద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోదీ ప్రభుత్వంతో చర్చలు జరడమే ఇండియా కూటమి లక్ష్యమని తెలిపారు. కేంద్రంతో శాంతియుతంగా చర్చలు జరిపేందుకు విపక్ష నేతలందూ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభలో నీట్ గురించి మాట్లాడేటప్పుడు మైక్‌ కట్ చేసినట్లు ధ్వజమెత్తారు. విద్యార్థుల సమస్యలపై పోరాడాలని నిర్ణయించామని తెలిపారు.

Also Read: యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు

గత ఏడేళ్లలో 70 సార్లు వివిధ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని.. దీనివల్ల రెండు కోట్ల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆరోపించారు. ఇవి చూస్తుంటే అవినీతి స్పష్టంగా జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రధానిని కోరుతున్నా కూడా ఆయన మౌనం వీడటం లేదంటూ విమర్శలు చేశారు.

Also Read: హోరాహోరీగా ట్రంప్ – బైడెన్ మధ్య డిబేట్

Advertisment
Advertisment
తాజా కథనాలు