INDIA Alliance: రెండో రోజు ప్రారంభమైన 'ఇండియా'కూటమి భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..

INDIA Alliance Meeting in Mumbai: ఇస్రో చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడాన్ని అభినందిస్తూ ప్రతిపక్ష కూటమి భారతదేశం శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇస్రో తన సామర్థ్యం పెంచుకుంటూ అంతకంతకూ పెరుగుతోందని, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపింది ఇండియా కూటమి. ఇస్రో అసాధారణ విజయాలు సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని, స్ఫూర్తిని పెంచుతుంది. యువత సైన్స్‌లో రాణించడానికి స్ఫూర్తిని రగిలిస్తుందని తీర్మానంలో పేర్కొంది విపక్ష కూటమి.

New Update
INDIA Alliance: రెండో రోజు ప్రారంభమైన 'ఇండియా'కూటమి భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..

INDIA Alliance Meeting in Mumbai: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఒక్కటైన విపక్ష కూటమి INDIA నేతల రెండవ రోజు భేటీ ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతోంది. తొలిరోజు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కూటమి.. రెండవ రోజు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇస్రో చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడాన్ని అభినందిస్తూ ప్రతిపక్ష కూటమి భారతదేశం శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇస్రో తన సామర్థ్యం పెంచుకుంటూ అంతకంతకూ పెరుగుతోందని, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపింది ఇండియా కూటమి. ఇస్రో అసాధారణ విజయాలు సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని, స్ఫూర్తిని పెంచుతుంది. యువత సైన్స్‌లో రాణించడానికి స్ఫూర్తిని రగిలిస్తుందని తీర్మానంలో పేర్కొంది విపక్ష కూటమి. అలాగే, చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగం కూడా సక్సెస్ కావాలని, ఆ ప్రయోగం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని పేర్కొంది.

మొంబైలో జరుగుతున్న ఈ విపక్ష కూటమి భేటీకి 28 బీజేపీయేతర పార్టీలు హాజరయ్యాయి. ఈ భేటీలో ఇండియా ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇండియా లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరో రోజుకు వాయిదా వేశారు. శివసేన (UBT) నేత, రాజ్యసభ ఎంపి సంజయ్ రౌత్ ఈ విషయాన్ని వెల్లడించారు. కూటమిలో లోగో చాలా కీలకమైనదని, దీనిపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందన్నారు. అయితే, శుక్రవారం లోగో ఆవిష్కరించబోమని ఆయన చెప్పారు.

publive-image

గురువారం జరిగిన సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కథనరంగానికి సిద్ధం కావాలని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేని ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని నేతలు నిర్ణయించారు. మరికొందరు నేతలు సీట్ల పంపకాలను ఖరారు చేసి, వీలైనంత త్వరగా ఉమ్మడి అజెండాతో ముందుకు రావాలని ఆకాక్షించారు. నేడు జరుగుతున్న భేటీలో కొన్ని కీలక అంశాలపై తీర్మానం చేయనుంది ఇండియా కూటమి.

ఇండియా కూటమి భేటీకి కపిల్ సిబల్..

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి రెండు రోజుల సమావేశంలో కపిల్ సిబల్ అనూహ్య ప్రవేశం కాంగ్రెస్ నాయకులలో కలకలం రేపింది. ఉద్ధవ్ థాకరేను సిబల్ ఆకస్మికంగా కలవడం చర్చనీయాంశమైంది. అయితే, దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. వీరి భేటీపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. గత ఏడాది మేలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కపిల్ సిబల్.. కాంగ్రెస్‌ను వీడుతానంటూ ప్రకటించారు. ఇప్పుడు ఈ భేటీకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఒక దేశం.. ఒకే ఎన్నికలు..

'ఒక దేశం.. ఒకే ఎన్నికలు'.. పేరుతో ప్రభుత్వం ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు మల్లిఖార్జున ఖర్గే. ఇంకా ఇలాంటి గేమ్స్ నడవవని, ఈ నిరంకుత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. కాగా, 'ఒక దేశం.. ఒకే ఎన్నికలు' సాధ్యాసాధ్యలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

భయపడుతున్న కేంద్రం..

ప్రతిపక్ష కూటమి బలం ప్రభుత్వంలో భయాన్ని కలిగించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఈ భయంతోనే ఇండియా కూటమి భాగస్వాములపై ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వ విచారణ సంస్థలను ఉసిగొల్పి, అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు మల్లిఖార్జున ఖర్గే. గత తొమ్మిదేళ్లుగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యాప్తి చేసిన మతపరమైన విద్వేషాలతో అమాయక ప్రజలు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:

Parliament’s special session: వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్.. బిల్లుకు ముహూర్తం ఫిక్స్!

విపక్ష కూటమి కన్వీనర్ రేసులో మరో నేత… తెరపైకి కొత్త పేరు….!

Advertisment
Advertisment
తాజా కథనాలు