/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/india-vs-england-vizag-test-jpg.webp)
India Wins Vizag Test Against England: తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది టీమిండియా. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌పై జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైన భారత్.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది. 106 పరుగుల తేడాతో గెలిచిన భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 255 రన్స్‌కు ఆలౌట్ అవ్వగా.. ఇంగ్లండ్ 292 రన్స్‌తో సరిపెట్టుకుంది.
Sharp Reflexes edition, ft. captain Rohit Sharma! 👌 👌
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @ImRo45 | @IDFCFIRSTBank pic.twitter.com/mPa0lUXC4C
— BCCI (@BCCI) February 5, 2024
బుమ్రా.. గిల్.. యశస్వీ హీరోలు:
తొలి ఇన్నింగ్స్‌లో ఏ ఒక్క బ్యాటర్ కనీసం 35 పరుగులు చేయని చోట టీమిండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) డబుల్ హండ్రెడ్‌తో మెరిశాడు. 209 పరుగులతో ఔరా అనిపించాడు. టెస్టుల్లో భారత్ తరుఫున డబుల్ సెంచరీ (Double Century) చేసిన అత్యంత పిన్న వయస్కుల జాబితాలో చేరాడు యశస్వీ. గతంలో వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్ తక్కువ వయసులోనే డబుల్ సెంచరీ చేశారు. అగ్రస్థానంలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (21 ఏళ్ల 35 రోజులు) ఉన్నాడు. 1993లో ఇంగ్లండ్‌పై 224 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 1993లోనే జింబాబ్వేపై 227 పరుగులు చేశాడు. అప్పుడు అతని వయస్సు 21 సంవత్సరాల 55 రోజులు. 1971లో వెస్టిండీస్‌పై 220 పరుగులు చేసిన భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (21 ఏళ్ల 283 రోజులు) కాంబ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక భారత్ బ్యాటింగ్ భారాన్ని యశస్వీ మోస్తే తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ భారాన్ని బుమ్రా (Jasprit Bumrah) మోశాడు.
What a throw by shreyas Iyer 🤯#INDvENG pic.twitter.com/hR3ecZEzm8
— Virat Kohli Fan Army (@ajeetyadav018) February 5, 2024
స్పిన్నర్లకు సహకరిస్తున్న పిచ్‌పై పేసర్ బుమ్రా ఆరు వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 రన్స్‌తో సరిపెట్టుకుంది. దీంతో భారత్‌కు 143 రన్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో శుభమన్‌గిల్ (Shubman Gill) ఒంటరిపోరు చేశాడు. సెంచరీతో తన టాలెంట్‌ను చూపించాడు. గత 13 టెస్టు ఇన్నింగ్స్‌ల నుంచి ఒక హాఫ్ సెంచరీ కూడా చేయని గిల్.. ఈసారి తన ప్రతిభను బయటకుతీశాడు. గిల్ సెంచరీతో భారత్ 255 రన్స్ చేయగలిగింది. 399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ విజయంవైపు ప్రయాణిస్తున్నట్టు అనిపించలేదు. ముఖ్యంగా అశ్విన్, బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. అటు అశ్విన్ (R Ashwin) మూడు వికెట్లు తియ్యగా.. 500వ టెస్టు వికెట్‌కు ఒక అడుగు దూరంలో నిలిచిపోయాడు.
Also Read: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెర..విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్