IND vs AUS: ఆటగాళ్ల భావోద్వేగం: కెప్టెన్ రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ కంటతడి

ఎన్నో అంచనాలు, ఆశలతో ఫైనల్లో అడుగు పెట్టిన భారత జట్టు పరాజయంతో ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఓటమితో వారు కంటతడి పెట్టగా, గెలుపోటములు సహజమంటూ టోర్నమెంట్ లో వారి ప్రదర్శనను అభిమానులు అభినందిస్తున్నారు.

New Update
IND vs AUS: ఆటగాళ్ల భావోద్వేగం: కెప్టెన్ రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ కంటతడి

IND vs AUS: కోట్లాదిమంది అభిమానులకు వరల్డ్‌కప్‌ను కానుకగా ఇద్దామనుకున్న భారత ఆటగాళ్లు పరాభవంతో భావోద్వేగానికి లోనయ్యారు. సెమీస్‌ వరకూ అపూర్వ ప్రదర్శనతో అదరగొట్టి ఫైనల్‌లో అనూహ్య పరాజయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. తన సారథ్యంలో వరల్డ్‌కప్‌ రూపంలో అభిమానులకు మరచిపోలేని కానుక ఇద్దామనుకున్న రోహిత్‌ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్నాడు. హైదరాబాదీ ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ కూడా ఓటమితో కంటతడి పెట్టాడు. కాగా, ఆటలో గెలుపోటములు సహజమని, ఫైనల్‌ వరకూ భారతజట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిందని అభిమానులు భరోసాగా నిలుస్తున్నారు.

ఇది కూడా చదవండి: IND VS AUS: కల చెదిరింది.. గుండె పగిలింది.. నిశ్శబ్ధమే మిగిలింది!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
Telangana Crime

Telangana Crime Photograph: (Telangana Crime )

భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హన్ముకొండలో చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణానికి చెందిన హిమబిందు(34)ను ఎల్కతుర్తి మండలానికి చెందిన శ్రీరామోజు రమేశ్​ చారికి ఇచ్చి 16 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈ 16 ఏళ్ల నుంచి రమేశ్ శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వేధింపులు భరించలేక..

ఎన్నో సార్లు గ్రామ పంచాయతీ వరకు వీరి గొడవ వెళ్లింది. అయినా కూడా రమేశ్ ప్రవర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో హిమబిందు రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మళ్లీ పంచాయితీ పెట్టి అత్తవారింటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెంది హిమబిందు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఇదిలా ఉండగా ఇటీవల వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కంది కవిత- శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల16న వివాహం జరిపించారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్త మామ లక్ష్మి, శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుండి తేవాలని శ్రుతిని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ నూతన వధువు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Advertisment
Advertisment
Advertisment