Rohit Sharma: పక్కకెళ్ళి ఆడుకోండి తమ్ముళ్లు.. రోహిత్‌ ఇక్కడ.. రికార్డులు చూస్తే మైండ్‌ బ్లాకే!

అఫ్ఘాన్‌పై జరిగిన మూడో టీ20లో సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి. టీ20Iలో అత్యధిక సెంచరీలు, భారత్‌ తరుఫున అత్యధిక సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు.. ఒకే ఇన్నింగ్స్‌లో 5కంటే ఎక్కువసిక్సులు(34) కొట్టిన భారత్ ప్లేయర్‌గా నిలిచాడు.

New Update
Rohit Sharma: పక్కకెళ్ళి ఆడుకోండి తమ్ముళ్లు.. రోహిత్‌ ఇక్కడ.. రికార్డులు చూస్తే మైండ్‌ బ్లాకే!

Rohit Sharma Records: తమ్ముళ్లు.. ఒకటి గుర్తుపెట్టుకోండి.. టీమిండియాలో ఎవరితోనైనా పెట్టుకోండి కానీ రోహిత్‌ శర్మ(Rohit Sharma)తో పెట్టుకోవద్దు.. ఎవర్ని అయినా ట్రోల్‌ చేయండి కానీ హిట్‌మ్యాన్‌ జోలికి రావద్దు.. ఎందుకంటే రోహిత్‌ ఎవరికైనా ఇట్టే ఇచ్చిపడేస్తాడు.. బ్యాట్‌తోనే బాదిపడేస్తాడు.. మూతి మూయిస్తాడు.. ముచ్చెమటలు పట్టిస్తాడు.. తక్కువ అంచనవేసిన వారి తాట తీస్తాడు.! అఫ్ఘాన్‌పై (India vs Afghanistan) మూడో టీ20 చూస్తే ఎవరికైనా ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. రోహిత్‌లో ఉన్న కసి అలా ఇలా ఉండదని.. ఊహించని రేంజ్‌లో ఉంటుందని ప్రపంచక్రికెట్‌కు మరోసారి తెలిసి వచ్చింది. డబుల్‌ సూపర్‌ ఓవర్స్‌ మ్యాచ్‌లో త్రిపుల్‌ హీరోగా నిలిచిన రోహిత్ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి.


అత్యధిక సెంచరీలు.. అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు:
22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను రింకూ సింగ్‌తో కలిసి 212కు 4 వికెట్ల వరకు తీసుకెళ్లాడు రోహిత్. 69 బంతుల్లోనే 121 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అటు సూపర్ ఓవర్స్‌లోనూ రోహితే హీరో. రెండు సూపర్‌ ఓవర్స్‌ కలిపి 7 బంతుల్లో 25 రన్స్ చేశాడు రోహిత్‌. అటు మిగిలిన ఆటగాళ్లు 4 బంతుల్లో కేవలం రెండు పరుగులే చేశాడు. సెకండ్‌ సూపర్‌ ఓవర్‌లో మొత్తం 11 రన్స్ చేసింది రోహిత్ ఒక్కడే. చెప్పాలంటే అఫ్ఘాన్‌ ఓడిపోయింది ఇండియాపై కాదు రోహిత్‌పై. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో అంతర్జాతీయ టీ20లో 5 సెంచరీలు (Most Centuries) చేశాడు రోహిత్‌. ఇంటెర్‌నేషనల్‌ టీ20ల్లో ఇన్ని సెంచరీలు ఎవరూ చేయలేదు. అటు ఇండియా తరుఫున టీ20Iలో అత్యధిక సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు (Player of the Match Awards) తీసుకున్నది కూడా రోహితే. ఈ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో మొత్తం ఆరుసార్లు ఈ అవార్డు దక్కించుకున్నాడు.


కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా.. రెండూ:
అఫ్ఘాన్‌పై మ్యాచ్‌ విజయంతో అంతర్జాతీయ టీ20ల్లో ఇండియన్‌ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు. ధోనీ సాధించిన 42 టీ20I విక్టరీలను సమం చేశాడు. ఇక స్లాగ్‌ ఓవర్స్‌(16-20)లో ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత్‌ ప్లేయర్‌ రోహిత్. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 66 రన్స్ చేశాడు రోహిత్. ఇక సిక్సుల్లో రోహిత్ ఎప్పుడూ ఎవర్‌గ్రీన్‌ ప్లేయరే. ఎవరికి అందనంత ఎత్తులోనే ఉంటాడు. ఇప్పటివరకు ఒకే ఇన్నింగ్స్‌లో భారత్‌ తరుఫున ఎక్కువసార్లు ఐదు కంటే ఎక్కువ సిక్సులు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇప్పటివరకు 34 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 5కంటే ఎక్కువ సిక్సులు కొట్టాడు.
Also Read: ఇరాన్ మీద పాకిస్తాన్ ప్రతీకార చర్యలు

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు