వానొచ్చే..ఎండొచ్చే..జ్వరం వచ్చే!

డెంగీ, చికున్‌గున్యా లాంటి వ్యాధులు చెన్నై ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ఇదే సమయంలో జలుబు, దగ్గుతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్నటిమొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. సడన్‌గా వచ్చిన వాతావరణ మార్పులతోనే ఈ తరహా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు

New Update
వానొచ్చే..ఎండొచ్చే..జ్వరం వచ్చే!

Fevers in Chennai: చెన్నై నగరాన్ని నిన్నటి వరకు ఎండలు, వానలు అల్లాడిస్తే ఇప్పుడు జ్వరాలు, ఇతర జబ్బులు బెంబెలేత్తిస్తున్నాయి. నగరంలో వానలు, ఎండలు ఒకదానికొకటి పోటీపడుతూ వంతులవారీగా ప్రజల మీద తమ ప్రభావన్ని చూపుతున్నాయి. ఒకేసారి ఇలా భిన్నమైన పరిస్థితులు ఏర్పడటం వల్ల ప్రజలకు రకరకాల జబ్బులు వస్తున్నాయి.

వైరల్ ఫీవర్స్‌ ఎక్కువగా పెరుగుతున్నాయి. దీనికి తోడు సీజన్ మారే సరికి గొంతునొప్పి, జలుబు, కంటి జబ్బులు కూడా అధికమవుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో గంటగంటకూ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నగరంలో అధిక వర్షాలు కురవడం వల్ల దోమల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది.

ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడే మురుగునీరు పేరుకుపోతుంది. దాంతో నగరంలో డెంగీ జ్వరాలు అధికమవుతున్నాయి. ముందు తుమ్ములు, ఆ పై జలుబు, గొంతునొప్పి పెరగటం అనేది ఈ జ్వరాలకు ప్రధాన సంకేతాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

చెన్నై నగరంలో గతవారం నాలుగు రోజులపాటు కురిసిన వాన జల్లులకు నగరం చల్లబడింది. ఆ తర్వాత మే నెలను తలపించే విధంగా తీవ్రమైన ఉష్ణోగ్రతతో ఎండలు నగరవాసులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. దాంతో ప్రజలు ఎక్కువగా శీతల పానీయాలకు మొగ్గు చూపుతున్నారు. ఏసీ గదుల్లో నుంచి బయటకు రావడం లేదు. దీంతో జలుబు, దగ్గుతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరం వైరస్‌ వల్ల కాదని, ఓ ప్రత్యేక రకమైన జ్వరమని మరికొందరు వైద్యులు చెబుతున్నారు.

పరీక్షలు చేసినప్పుడు డెంగీ జ్వరం కాదని నిర్ధారణ అవుతున్నా, సాధారణ జ్వరానికి ఇచ్చే మందులు, సూదిమందులు ఇస్తే ఈ రకం జ్వరాలు త్వరగా తగ్గడం లేదని చెప్పారు. వాననీరు కొన్ని చోట్లు నిల్వ ఉండటం వల్ల దోమలు సంఖ్య పెరుగుతోంది. నగరవాసులు దోమల నిరోధక చర్యలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడిగా ఉన్న ఆహారాన్నే భుజించాలని వారు సూచించారు.

ప్రతి సంవత్సరం జులై, ఆగస్టు సీజన్లలో జలుబు దగ్గు జ్వరాలు రావడం సాధారమైన విషయాలేని రాష్ట్ర ఆరోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్‌ సెల్వవినాయగం అన్నారు. అయితే నగరవాసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన ఎంతైనా ఉందన్నారు.

డెంగ్యూ, చికున్‌గున్యా జ్వరాలు వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆసుపత్రులకు వెళ్ళి సకాలంలో చికిత్సలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఇళ్ల చుట్టూ మురుగు చేరకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

Also Read: కుల్గాంలో ఎన్‌ కౌంటర్‌ ..ముగ్గురు జవాన్లు మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు