Komatireddy Ventak Reddy: నకిరేకల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక సమావేశం

నకిరేకల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన వేముల వీరేశం టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది

New Update
Komatireddy Ventak Reddy: నకిరేకల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక సమావేశం

నల్గొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సీఎం కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో వీరేశం కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కావడం చర్చనీయశంగా మారింది. వేముల వీరేశాన్ని పార్టీలోకి తీసుకుంటే ప్రార్టీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందా.? ఒకవేళ వేముల వీరేశాన్ని పార్టీలోకి తీసుకుంటే.. ఇప్పటికే పార్టీలో ఉండి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న వారి పరిస్థతి ఏంటి.? అలాంటి నేతలకు పదవులు ఇచ్చి సరిపెట్టాలా అనే దానిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన ఆన.. కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం చిరమర్తి లింగయ్య బీఆర్‌ఎస్‌లో చేరడంతో సీం కేసీఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే సీటు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనకు సీటు ఇవ్వకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంతో వీరేశం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గతంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వేముల వీరేశం ఏ పార్టీ సపోర్ట్‌ లేకుండా కౌన్సిలర్‌లను గెలిపించుకున్నాడు. తన అనుచరులను రెబల్‌గా నిలబెట్టి 8 మందిని గెలిపించుకున్న నేతను తమ పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేముల వీరేశం చేరికపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇస్తే అందరూ కలిసి పని చేయాలని, నకిరేకల్‌లో కాంగ్రెస్ జెండాఎగురవేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్‌ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు