Heavy Rains : నేడు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు!

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా సాగుతున్న ద్రోణి ప్రభావంతో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని సమచారం

New Update
Mumbai: ముంబైకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్

Rains : ఏపీ(AP) ప్రజలకు వాతావరణ శాఖ(Department of Meteorology) చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా(North Coast) లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా సాగుతున్న ద్రోణి ప్రభావంతో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని సమచారం.ఈ వర్షాలు ఎక్కువగా ఉత్తర కోస్తాలో కురుస్తాయని అధికారులు వివరించారు.

రాబోయే మూడు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడకక్కడా జల్లులు పడే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్లు పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వానలు కురుస్తాయని అధికారులు వివరించాయి. ఇప్పటికే మంగళవారం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపుఉరం, మన్యం, విశాఖ జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి,. రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. ఉష్ణోగ్రతలు(Temperatures) తగ్గి వాతావరణం చల్లబడింది.

వర్షం కురిసే సమయంలో చెట్లు, కరెంట్‌ పోల్స్‌, టవర్స్‌ కింద నిల్చో వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : నేడే తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్…

Advertisment
Advertisment
తాజా కథనాలు