Back Pain Tips: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి!

నేటికాలంలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.వ్యాయామంతోపాటు ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు నడుము నొప్పితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు నొప్పి నుంచిఉపశమనం కలిగించే పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

New Update
Back Pain Tips: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి!

నడుము నొప్పి అనేది ఈరోజుల్లో సాధారణ సమస్యనే అయినప్పటికీ...దీని తీవ్రత చాలా ఉంటుంది. నడుము నొప్పితోపాటు చాలా మంది వెన్నునొన్పి సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. ఉద్యోగస్తులు ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేయడం, తప్పుడు పొజిషన్ లో కూర్చోవడం వల్ల ఈ సమస్య పెరుగుతోంది. అంతేకాదు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి, పోషకాహార లోపం ఇవన్నీ కూడా నడమునొప్పికి కారణాలుగా చెప్పవచ్చు.

వ్యాయామం:
నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయాయం కండరాలకు ఉపశమానాన్ని ఇవ్వడేమ కాదు...శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి: నిరుద్యోగులకు అలర్ట్…600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ…!!

ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ:
కేవలం వ్యాయామం ఒక్కటే కాదు...మీరు తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలిగించే పోషకాలు అధికంగా ఉండే ఫుడ్ ను మీ డైట్లో చేర్చుకోవాలి. ఇప్పుడు నడము నొప్పి నుంచి ఉపశమనం కలిగించే కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

డ్రైఫ్రూట్స్:
మిమ్మల్ని నడుము నొప్పి వేధిస్తున్నట్లయితే..ఓమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా బాదం, వాల్నట్, చియాసీడ్స్, అవిసె గింజలు, చేపలను ఆహారంలో చేర్చుకునేలా చూడాలి. వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవే కాదు వంట నూనె కోసం ఆవాల నూనె, ఆలివ్ ఆయిన్ ను ఉపయోగించడం మంచిది. వీటిని డైట్లో చేర్చుకుంటే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు.

మసాల దినుసుల:
నొప్పిని తగ్గించడంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎంతగానో సహాయపడతాయి. దాల్చినచెక్క, ఎర్ర మిరపకాయలు, అల్లం వంటి వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ మసాలా దినుసులన్నీ వంటగదిలోనే ఉంటాయి. పసుపు కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్:
శరీరంలో ప్రొటీన్ లోపం ఉంటే కూడా నడుము నొప్పి వస్తుంది. అందుకే మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్ అధికంగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా గుడ్లు, పాలు, పప్పులు, వీటిలో ప్రొటీన్ అధికంలో మొత్తంలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త…స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!!

ఆకుకూరలు:
వెన్నునొప్పి, నడుము నొప్పి నుంచి బయటపడేందుకు కాలీఫ్లవర్, బ్రొకలీ, బచ్చలికూర, క్యాబేజీతోపాటు ఆకు కూరలను కూడా డైట్లో చేర్చుకోవచ్చు. వీటిల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె ఉంటుంది. ఇవి నొప్పి నుంచి ఉపశమానాన్ని అందిస్తాయి.

కూరగాయలు:
బీట్ రూట్, క్యారెట్, గుమ్మడికాయ వంటి రూట్ వెజిటేబుల్స్ ను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నొప్పిని నివారిస్తాయి.

బెర్రీస్:
తాజా పండ్లు, పైనాపిల్, యాపిల్, చెర్రీలు, బ్లాక్ బెర్రీస్, సిట్రస్ పండ్లు, ద్రాక్ష ఇవన్నీ కూడా నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కూడా నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు