Team India Coach: కొత్త కోచ్ గా గంభీర్! అదే జరిగితే.. కోహ్లీ ఏం చేస్తాడు?

టీమిండియా కొత్త కోచ్ కోసం వేట మొదలైంది. గౌతమ్ గంభీర్ కొత్త కోచ్ గా రావచ్చని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లీ.. గంభీర్ మధ్య చాలాకాలంగా సత్సంబంధాలు లేవు. కోచ్ గా గంభీర్ వస్తే కోహ్లీ ఏం చేస్తాడు? అసలు వీరిద్దరి మధ్య గొడవేంటి? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూడాల్సిందే. 

New Update
Team India Coach: కొత్త కోచ్ గా గంభీర్! అదే జరిగితే.. కోహ్లీ ఏం చేస్తాడు?

Team India Coach: అది 2013.. ఏప్రిల్‌ 11.. వేదిక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం.. కోల్‌కతా వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌ జరుగుతోంది.. లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్‌లో కోహ్లీ 35 పరుగుల వద్ద ఔటయ్యాడు.. వెంటనే కేకేఆర్‌ ప్లేయర్లు కోహ్లీ వికెట్‌ను సెలబ్రెట్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది సాధారణమే అయినా కోహ్లీ మాత్రం ఈజీగా తీసుకోలేకపోయాడు.పెవిలియన్ వైపు వెళ్లకుండా కోహ్లీ KKR ఆటగాళ్ల వైపుకు వెళ్లాడు. అంతకముందు గంభీర్‌ ఏదో అన్నట్టుగా చెబుతుంటారు.. దాదాపు కోహ్లీ-గంభీర్‌ కొట్టుకునే పని చేశారు. మధ్యలో రజత్‌ పటిదార్‌ ఇద్దరిని ఆపాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోలే క్రికెట్‌ గ్రౌండ్‌లో రెజ్లింగ్‌ జరిగేది.. 2023 లక్నోపై మ్యాచ్‌ సందర్భంగానూ ఈ ఇద్దరి మధ్య నానా రచ్చ జరిగింది..! సీన్‌ సీన్‌ కట్‌ చేస్తే.. గంభీర్‌ టీమిండియాకు కోచ్‌గా అవతరించనున్నడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇదే జరిగితే కోహ్లీ గంభీర్‌తో ఎలా నడుచుకుంటాడన్న చర్చ క్రికెట్‌ వర్గాల్లో జోరుగా సాగుతోంది!

Team India Coach: 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా దూసుకుపోతోంది. అందరికంటే ముందుగా ప్లేఆఫ్‌కు చేరుకున్న కోల్‌కతా ఇలా ఆడుతుందని ముందుగా ఎవరూ ఊహించలేదు. కోల్‌కతా ఆట కూడా మొత్తం మారిపోయింది.. స్ట్రాటజీలూ కొత్తగా అనిపిస్తున్నాయి.. అగ్రెసివ్‌ అప్రోచ్‌తో విజయాల బాట పట్టింది. ఇదంతా గంభీర్‌ కారణంగానే జరుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ ఓపెనర్‌గా జట్టుకు ఎన్నో విజయాలు అందిస్తున్నాడు. కోల్‌కతా టీమ్‌కు గంభీర్‌ కెప్టెన్‌గా ఉన్న కాలంలో నరైన్‌ ఓపెనర్‌గా వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. గంభీర్‌ కోల్‌కతా ఎగ్జిట్‌ తర్వాత కేకేఆర్‌ ఆశించిన స్థాయిలో ఆడలేదని లెక్కలు చెబుతున్నాయి.

Team India Coach: ఐపీఎల్‌లో 2008-2023 వరకు కోల్‌కతాకు రెండు టైటిల్స్‌ ఉన్నాయి. ఈ రెండూ కూడా గంభీర్‌ కెప్టెన్సీలోనే వచ్చాయి. అయితే ఆ తర్వాత గంభీర్‌ పలు ప్రాంచైజీలకు  సేవలందించాడు. 2023లో లక్నో టీమ్‌కు మెంటర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో ఓ మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇది అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారింది. లక్నో టీమ్‌ ఓనర్‌ గోయెంకాతో కోహ్లీకి  మంచి సంబంధాలున్నట్టుగా ఎక్స్‌పర్ట్స్‌ చెబుతుంటారు. ఇక కోహ్లీతో గొడవ తర్వాత విరాట్‌ ఫ్యాన్స్‌ అంతా లక్నో టీమ్‌కి యాంటీగా మారిపోయారు. ఇది లక్నో ఫ్యాన్‌ బేస్‌పై ప్రభావం చూపించింది. తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ గంభీర్‌ను లక్నో టీమ్‌ సాగనంపింది.

Also Read:  టీ20 వరల్డ్ కప్.. వార్మప్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే..

Team India Coach: లక్నో టీమ్‌ ఎగ్జిట్‌ తర్వాత గంభీర్‌ తిరిగి కోల్‌కతా ఫ్రాంచైజీతో కలిశాడు. నైట్‌రైడర్స్‌ మెంటర్‌గా తన మార్క్‌ చూపిస్తున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలిసారి గ్రూప్‌ దశ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిందంటే దాని వెనుక గంభీర్‌ ఐడియాలు ఉన్నాయంటారు క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌.  మరోవైపు టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుంది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌ కోసం వేట ప్రారంభించింది. ఇందులో భాగంగానే గంభీర్‌ను సంప్రదించింది. గంభీర్‌ ఈ ప్రతిపాదనకు ఓకే వ్యక్తం చేస్తే భారత జట్టు చీఫ్‌ కోచ్‌గా అతని ఎంపిక లాంఛనమే అవుతుంది.

Team India Coach: నిజానికి గంభీర్‌ టాలెంట్‌ గురించి ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. టీ20 వరల్డ్‌కప్‌ 2007 విజయంలో, 2011 వరల్డ్‌కప్‌ సాధించిన భారత జట్టులో గౌతం గంభీర్‌ కీలక సభ్యుడు. రెండు ఫైనల్స్‌లోనూ గంభీర్‌ ఇన్నింగ్స్‌ భారత్‌ విజయంలో కీ రోల్‌ ప్లే చేసింది. అయితే గంభీర్‌ కోచ్‌ వార్తల తర్వాత జరుగుతున్న చర్చ అంతా కోహ్లీ చుట్టూనే నడుస్తోంది. గంభీర్‌ హెడ్‌కోచ్‌గా టీమిండియాకు బాధ్యతలు వహిస్తే ఈ ఇద్దరు ఎలా కలిసి నడుచుకుంటారన్నదానిపై క్రికెట్‌ లవర్స్‌  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు