కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తీరు వివాదాస్పమైంది. ఆదివారం దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా రామాలయాల్లో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించారు. ఈ క్రమంలోనే ఆలూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే విరూపాక్షి సొంతూరు చిప్పగిరిలో శనివారం రాములోరి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారు.
Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
సాధారణంగా సీతారాముల కళ్యాణంలో భాగంగా అర్చకులు శ్రీరాములవారి తరుపున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని ఉంచుతారు. భక్తులకు మంగళసూత్రాన్ని చూపించిన తర్వాత.. ఆ రాములోరి తరుఫున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని పండితులు ఉంచుతారు. అయితే ఆలూరు ఎమ్మెల్యే మాత్రం తానే స్వయంగా సీతాదేవి మెడలో మంగళసూత్రాన్ని వేయడం వివాదాస్పదమవుతోంది.
Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావటంతో నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వారైనా ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించాల్సి ఉంది.
సీతమ్మ వారి మంగళసూత్రం తాకి ఇవ్వమని, ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు తాళి ఇచ్చారు. అయితే.. ఆ తాలిని కళ్ళకు అద్దుకోవాల్సింది పొగా... పొరపాటున సీతమ్మవారికి ఆ మంగళసూత్రాన్ని కట్టేశారు ఎమ్మెల్యే విరూపాక్షి.అయితే ఈ తథంగాన్ని అడ్డుకోకుండా పండితులు కూడా అక్షింతలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో... ఎమ్మెల్యే పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్షి క్షమాపణలు కూడా చెప్పారు . పండితులు కట్టమంటే... తాను సీతమ్మ మెడలో తాళిబొట్టు కట్టినట్లు తెలిపారు. 15 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నానని కూడా క్లారిటీ ఇచ్చారు విరూపాక్షి.
Also Read:Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు!
Also Read: Ap :ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!
ycp-mla | kurnool | ap | aluru | mla virupakshi | sri-rama-navami | latest-news | telugu-news | latest telugu news updates