World Cup 2023: 'బుద్ధి ఉన్నొడు ఎవడైనా అతనికి బౌలింగ్ ఇస్తాడా'? పాకిస్థాన్ మాజీల తిట్ల దండకం! ఉసామా మీర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన మ్యాచ్‌లో అతడిని కాదని నవాజ్‌కు బౌలింగ్ ఇచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై విరుచుకుపడ్డాడు ఆ జట్టు లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్. పాక్‌పై దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఓవర్ నవాజ్‌కు ఇవ్వడం బాబర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా వసీం మండిపడ్డాడు. By Trinath 28 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వరల్డ్‌కప్‌లో అన్ని జట్లది ఒక తీరు అయితే పాకిస్థాన్‌ది మరో తీరు. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ రేస్‌లో ఇండియాతో సమానంగా ఉన్నామని ఫీల్ అయిన పాకిస్థాన్ తర్వాత వరుస పెట్టి ఓడిపోతూ వస్తోంది. ఇండియాపై ఓటమితో మొదలైన పరాజయాలు నిన్నటి దక్షిణాఫ్రికా మ్యాచ్ వరుకు కొనసాగాయి. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన పాక్ కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది. కేవలం 4 పాయింట్లతో పాటు నెగిటివ్‌రన్‌రేట్‌తో పాకిస్థాన్ సెమీస్ ఆశలను కష్టం చేసుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్‌కు చేరుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఇక నిన్న దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో లాస్ట్ వికెట్ తియ్యలేకపోయిన పాకిస్థాన్ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ బాబర్ అజామ్‌పై విమర్శలు పెరిగిపోయాయి. Also Read: ఆస్ట్రేలియా గెలవడానికి అసలు కారణం ఇదే.. ఎవరైనా అడిగితే ఈ ప్రూఫ్స్ చూపించండి! నవాజ్‌కు ఎందుకు ఇచ్చినట్లు? దక్షిణాఫ్రికాపై మ్యాచ్ చివరిలో ఉసామా మిర్‌కు బౌలింగ్ ఇవ్వకుండా నవాజ్‌కు బౌలింగ్ ఇచ్చిన బాబర్ అజామ్‌పై విమర్శలు పెరిగిపోతున్నాయి. బాబర్ అలా చేయకుండా ఉండాల్సిందంటూ మాజీలు మండిపడుతున్నారు. ముఖ్యంగా బాబర్‌పై ఇండియాతో ఓటమి తర్వాత గుర్రుగా ఉన్న పాక్ లెజండరీ క్రికెటర్ వసీం అక్రమ్ మరోసారి నోటికి పని చెప్పాడు. నవాజ్‌పై పాక్ మొత్తానికి కోపంగా ఉంటుందని.. అయితే ఉసామాకు కాకుండా నవాజ్‌కు బౌలింగ్ ఇచ్చిన బాబర్‌ది అసలు తప్పంటూ వసీం ఫైర్ అయ్యారు. వసీం ఏం అన్నాడంటే: 'చివరలో కొన్ని పొరపాట్లు జరిగాయి. జట్టు ఓడిపోయినప్పుడు విమర్శలు సహజం. చివరి ఓవర్ నవాజ్‌కి ఇచ్చారు. దేశం మొత్తం నవాజ్‌పై విమర్శల దాడి చేస్తుందని నాకు తెలుసు కానీ ఆ సమయంలో ఉసామా మీర్‌కు రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. నిన్నటి మ్యాచ్‌లో ఉసామా మీర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. టెయిలైండర్‌లను గూగ్లీలతో ఇబ్బంది పెట్టే అవకాశాలు అతనికే ఉన్నాయి. మొదటి మూడు-నాలుగు ఓవర్లు ఫర్వాలేదు కానీ తర్వాత రెండు వికెట్లు తీశాడు. కాబట్టి ఉసామా ఆ ఓవర్‌ని బౌల్ చేసి ఉండాల్సింది. ఇది ఒక్కటి తీసేస్తే కెప్టెన్సీ బాగానే ఉంది.. కానీ ఆ ఓవర్‌లో నవాజ్‌కి బాల్ ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు.. నవాజ్‌లో కాన్ఫిడెన్స్ కూడా లేదు..' అని వసీం మండిపడ్డాడు. ఇది బాబర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా అభివర్ణించాడు. Also Read: పేరుకేమో తోపు, తురుము.. ఇప్పుడేమో ఆటలో అరటిపండు! #cricket #babar-azam #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి