IND vs NED: 64 మీటర్లంటా.. ఇక కుమ్ముకోవడమే.. రికార్డులు బ్లాస్ట్ అవ్వడమే!

చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా, నెదర్లాండ్స్ తలపడతున్నాయి. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌లు ఫిక్స్‌ కావడంతో ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత రికార్డులపై ఫ్యాన్స్‌ చూపు నెలకొంది.

New Update
IND vs NED: 64 మీటర్లంటా.. ఇక కుమ్ముకోవడమే.. రికార్డులు బ్లాస్ట్ అవ్వడమే!

వరల్డ్‌కప్‌లో గ్రూప్‌ మ్యాచ్‌లు ఎండ్‌కు వచ్చాయి. నెదర్లాండ్స్‌ వర్సెస్‌ ఇండియా మ్యాచ్ గ్రూప్‌ స్టేజీలో చివరిది. బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రోహిత్ సేన బ్యాటింగ్‌ ఎంచుకుంది. కోహ్లీ 50వ సెంచరీవైపే అందరి దృష్టి నెలకొంది. గ్రౌండ్‌కు చిన్నది కావడంతో పాటు బౌండరీ లెంగ్త్‌ను మరింత తగ్గించడంతో సిక్సులు, ఫోర్లు కొట్టుకోవడం ఈజీ. దీంతో ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు రోహిత్‌ మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూపిస్తాడని.. కోహ్లీ గ్రౌండ్‌లో పరిగెత్తిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మార్పులు లేవు:
ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి తిగింది. ఇప్పటికీ టీమ్‌ ఇండియా సెమీస్‌ బెర్త్‌ను కన్ఫామ్‌ చేసుకుంది. ఈ నెల 15న ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌కు పలువురు సీనియర్లకు రెస్ట్ ఇస్తారని అంతా భావించారు. ముఖ్యంగా పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి మార్పులు లేకుండానే భారత్‌ బరిలోకి దిగింది.

కోహ్లీ 50వ సెంచరీ చేస్తాడా?
ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కోహ్లీపైనే పడింది. ఇప్పటికే 49 సెంచరీలతో సచిన్‌ వన్డే హండ్రెడ్స్‌ రికార్డును సమం చేసిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో 50వ శతకంపై కన్నేశాడు. ఇదే జరిగితే వన్డే హిస్టరీలో అద్భుతమే అవుతోంది. ఇక మ్యాచ్‌ కూడా బెంగళూరులో కావడంతో కోహ్లీ చెలరేగిపోతాడని అంతా భావిస్తున్నారు. స్ట్రైట్ బౌండరీ రోప్‌ కేవలం 73మీటర్లే ఉండడంతో బౌండరీలు బాదడం ఈజీ. ఇటు సైడ్‌ బౌండరీస్‌ కూడా 64 మీటర్లే కావడంతో సిక్సులు ఈజీగా వెళ్తాయని ఫ్యాన్స్ అంటున్నారు.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్

Also Read: ఒక్క బంతికి 286 రన్స్.. ఈ మేటర్‌ తెలుసుకుంటే పిచ్చెక్కిపోద్ది భయ్యా!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు