IND VS AUS: ప్చ్.. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మిస్‌.. 'హెడ్‌' పగిలే క్యాచ్‌ భయ్యా!

వరల్డ్‌కప్‌ ఫైనల్‌లోనూ రోహిత్ శర్మ సత్తా చాటాడు. తన స్ట్రాటజీని పక్కాగా అమలు చేశాడు. 31 బంతుల్లో 47 రన్స్ చేసిన రోహిత్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హెడ్‌ అద్భుతమైన క్యాచ్‌కు వెనుతిరిగాడు.

New Update
IND VS AUS: ప్చ్.. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మిస్‌.. 'హెడ్‌' పగిలే క్యాచ్‌ భయ్యా!

ICC WORLD CUP 2023: వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ తన సూపర్‌ ఫామ్‌ను కంటీన్యూ చేశాడు. ఆస్ట్రేలియాపై పైనల్‌లో దూకుడిగా బ్యాటింగ్ చేశాడు. అద్భుతమైన కిక్ స్టార్ట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఆస్ట్రేలియా పేసర్ల టార్గెట్‌గా మెరుపు బ్యాటింగ్ చేశాడు. గిల్‌ త్వరగా ఔటైనా రోహిత్ మాత్రం వేగంగా బ్యాటింగ్‌ చేశాడు. అయితే తృటిలో హాఫ్‌ సెంచరీ కోల్పోయాడు.


మరోసారి 40ల్లో:
ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ మరోసారి 40sలో ఔట్ అయ్యాడు. 31 బంతుల్లో 47 రన్స్ చేసిన రోహిత్ మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌ హెడ్‌ అద్భుతమైన క్యాచ్‌కు వెనుతిరిగాడు. గత సెమీస్‌లోనూ రోహిత్‌ 47 పరుగులే చేశాడు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ ఏకంగా 5సార్లు 40sలో ఔట్ అయ్యాడు. మరోవైపు రోహిత్‌ అరుదైన రికార్డును కోల్పోయాడు. వరుసగా రెండు వరల్డ్‌కప్‌ ఎడిషన్స్‌లో 600కు పైగా పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మరో 3 రన్స్ చేసి ఉంటే రోహిత్ ఖాతాలో ఈ రికార్డు వచ్చి చేరేది.

వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో రికార్డులు సచిన్ పేరిట ఉన్నాయి.. సచిన్ ఆరు వరల్డ్‌కప్‌లు ఆడాడు.. అయితే ఏ రెండు ఎడిషన్స్‌లోనూ 600కు పైగా పరుగులు చేయలేదు. 2003 ప్రపంచకప్‌లో 673 రన్స్ చేశాడు. 1996 వరల్డ్‌కప్‌లో 523 రన్స్ చేశాడు. 2011 వరల్డ్‌కప్‌లో 482 రన్స్ చేశాడు. ఇటు రోహిత్ 2019 ప్రపంచకప్‌లో రోహిత్‌ 649 రన్స్ చేశాడు. ఫైనల్‌లో జరిగే మ్యాచ్‌లో 50 రన్స్ చేసి ఉంటే 600 రన్స్ మార్క్‌ దాటి ఉండేది. ఇలా ఇప్పటివరుకు ఏ దిగ్గజ క్రికెట్ కూడా చేయలేదు. ఫైనల్‌లో రోహిత్‌ మరో 3 పరుగులు చేసి ఉండాల్సిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Also Read: జనగణమన గూస్‌ బంప్స్.. వైరల్ వీడియో!

Advertisment
Advertisment
తాజా కథనాలు