Virat kohli: 52ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. 50వ సెంచరీతో కింగ్‌ కోహ్లీ నయా రికార్డు!

వన్డే క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడిగా నిలిచాడు కింగ్‌ కోహ్లీ. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా కివీస్‌పై జరుగుతున్న సెమీస్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.

New Update
Virat kohli: 52ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. 50వ సెంచరీతో కింగ్‌ కోహ్లీ నయా రికార్డు!

Virat kohli: ఎవరికి సాధ్యం కాదనుకున్న రికార్డులు ఈజీగా బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. వన్డేల్లో 50వ సెంచరీతో సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా వన్డేలో 50 సెంచరీలు చేయలేదు. సచిన్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డును ఈ వరల్డ్‌కప్‌లోపే సమం చేసిన కోహ్లి.. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో సెంచరీతో 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వాంఖడే వేదికగా జరుగుతున్న సెమీస్‌ ఫైట్‌లో కోహ్లీ మరెన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు.


673 బ్రేక్‌:
20ఏళ్లుగా సచిన్‌ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. సింగిల్‌ ఎడిషన్‌ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్‌ 673 రన్స్ చేయగా.. కోహ్లీ ఆ మార్క్‌ను దాటాడు.

ప్రపంచకప్ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు
694*- కోహ్లీ(2023)
673 - సచిన్ టెండూల్కర్ (2003)
659 - మాథ్యూ హేడెన్ (2007)
648 - రోహిత్ శర్మ (2019)
647 - డేవిడ్ వార్నర్ (2019)

అంతేకాదు కోహ్లీ ఖాతాలో మరెన్నొ రికార్డులు వచ్చి చేరాయి. ప్రపంచకప్‌లో ఒక్కటే ఎడిషన్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన సచిన్‌ రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేశాడు.

ప్రపంచకప్ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక 50+ స్కోర్లు

8 - విరాట్ కోహ్లీ (2023)*
7 - సచిన్ టెండూల్కర్ (2003)
7 - షకీబ్ అల్ హసన్ (2019)
6 - రోహిత్ శర్మ (2019)
6 - డేవిడ్ వార్నర్ (2019)

ఐసీసీ వైట్ బాల్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక 50+ స్కోర్లు చేసింది కూడా కోహ్లీనే..!
7 - విరాట్ కోహ్లీ*
6 - సచిన్ టెండూల్కర్
5 - జాక్వెస్ కల్లిస్
5 - సంగక్కర

ఐసీసీ వైట్ బాల్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక 50+ స్కోర్లు చేసింది కూడా కోహ్లీనే..!
7 - విరాట్ కోహ్లీ*
6 - సచిన్ టెండూల్కర్
5 - జాక్వెస్ కల్లిస్
5 - సంగక్కర

Also Read: రోహిత్‌ డామినేషన్‌ చూస్తే మైండ్‌ బ్లాక్‌.. ఈ లెక్కలు చూడండి తమ్ముళ్లూ!

Advertisment
Advertisment
తాజా కథనాలు