Virat Kohli: రికార్డుల రారాజు కోహ్లీ ఖాతాలో ఊహించని రికార్డు.. బాధపడుతున్న ఫ్యాన్స్! టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఖాతాలో అన్‌వాన్‌టెడ్ రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ డకౌటైన విషయం తెలిసిందే. ఇదే కోహ్లీకి 34వ డకౌట్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో 34సార్లు డకౌట్ అయ్యాడు. బ్యాటర్ల పరంగా చూస్తే ఈ ఇద్దరే ఇండియా నుంచి ఎక్కువసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు. By Trinath 29 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India vs England: సచిన్(Sachin Tendulkar) రికార్డులకు తిరుగే లేదని అంతా భావిస్తున్న సమయంలో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) తక్కువ కాలంలోనే మాస్టర్ రికార్డులను బ్రేక్ చేశాడు. మరికొన్ని రికార్డులను బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. వన్డేల్లో సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డును సమం చేయడానికి కోహ్లీ అడుగుదూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డును ఈక్వెల్ చేస్తాడని అంతా భావించగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విరాట్ డకౌట్ అయ్యాడు. నిజానికి ఏ ప్లేయర్ కూడా ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడలేదు. ఈ వరల్డ్‌కప్‌లో విరాట్ టీమిండియాను పలు మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఆస్ట్రేలియాపై వరుసగా మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో అన్నీ తానై రాహుల్‌తో కలిసి జట్టుకు విక్టరీని అందించాడు. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ అదే జోరును కొనసాగించిన కోహ్లీ ఇంగ్లండ్‌పై మాత్రం ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో డకౌటైన కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు వచ్చి చేరింది. సచిన్ రికార్డు సమం: సచిన్ సెంచరీల రికార్డును సమం చేస్తాడనుకుంటే డకౌట్ల రికార్డును ఈక్వెల్ చేశాడు కోహ్లీ. దీంతో ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 34 సార్లు డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్‌పై మ్యాచ్ డకౌట్‌తో కోహ్లీ కూడా 34సార్లు డకౌట్ అయిన రికార్డును మూటగట్టుకున్నాడు. నిజానికి ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల జాబితాలోనూ ఈ ఇద్దరే ఫస్ట్, సెకండ్‌లో ఉన్నారు. సచిన్ 100 సెంచరీలు చేస్తే.. కోహ్లీ 78 సెంచరీలు చేశాడు. కోహ్లీ డకౌట్ రికార్డును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ సెంచరీలు చేయడం మనుషులకు సాధ్యం కాదని గుర్తు చేస్తున్నారు. కింగ్ ఆఫ్ సెంచరీలు, కింగ్ ఆఫ్ డకౌట్లు రెండూ కూడా కోహ్లీ ఖాతాలోనే ఉన్నాయని ఫ్యాన్స్ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇక టీ20, వన్డే ప్రపంచకప్‌లో గత 56 ఇన్నింగ్స్‌లలో కోహ్లీకి ఇదే తొలి డకౌట్. First duck for Virat Kohli in the World Cups (ODI/T20) His streak of 56 innings without a duck in World Cups comes to an end💔#INDvsENGpic.twitter.com/XOJ7hr0Dsh — VINEETH𓃵🦖 (@sololoveee) October 29, 2023 ఈ ఇద్దరి తర్వాత ఎవరంటే? కోహ్లీ, సచిన్ తర్వాత టీమిండియా నుంచి ఎక్కువ సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా సెహ్వాగ్ నిలిచాడు. సెహ్వాగ్ 31 సార్లు డకౌట్ అవ్వగా.. రోహిత్ శర్మ 30 సార్లు, గంగూలీ 29సార్లు డకౌట్ అయ్యారు. అటు మాజీ కెప్టెన్ ధోనీ 21 టైమ్స్ ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరాడు. అయితే ఇదంతా టాప్-7 బ్యాటర్ల లిస్ట్. ఓవరాల్‌గా ఇండియా నుంచి 44 డకౌట్లతో జహీర్ ఖాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువసార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా శ్రీలంక స్పిన్నర్ మురళిథరన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ స్పిన్ మంత్రికుడు అత్యధికంగా 59సార్లు సింగిల్ రన్ మార్క్ టచ్ చేయకుండా క్రీజును వీడాడు. Also Read: గెలుస్తారా.. బోర్లా పడుతారా? ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే? #virat-kohli #sachin-tendulkar #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి