Jr NTR: 'ఆస్ట్రేలియా టీమ్‌తో కనెక్ట్ ఐపోయా ..' జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్! ఆస్ట్రేలియా టీమ్‌తో తాను ఎక్కువగా కనెక్ట్ అయ్యానంటూ జూనియర్ ఎన్టీఆర్ గతంలో చెసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఆరోసారి గెలుచుకున్న విషయం తెలిసిందే. తారక్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ను ఓ ఎన్టీఆర్ ఫ్యాన్ షేర్ చేయగా..అది వైరల్‌గా మారింది. By Trinath 21 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ICC WORLD CUP 2023: ఇండియాలో పుట్టినంత మాత్రానా భారత్ క్రికెట్ జట్టునే ఎక్కువగా ఇష్టపడాలని రూల్ లేదు. మిగిలిన జట్లను ఇష్టపడుతూ కూడా సొంత దేశానికి చెందిన జట్టును సపోర్ట్ చేసుకోవచ్చు. ఇక ఎవరి ఫేవరెట్లు వారికి ఉంటాయి. దేశం, ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేకుండా టాలెంట్‌ను బట్టి, స్కిల్‌ను బట్టి.. లేకపోతే ఏదో ఒక కారణంగా ఎవరి ఫేవరెట్లను వారు ఎంచుకుంటారు. ఫేవరెట్ అన్నది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం. ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే కేవలం భారతీయులకే కాదు చాలా దేశాల ప్రజలకు ఫేవరెట్‌గా ఉంటుంది. ఇక ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాల పాటు శాసించిన ఆస్ట్రేలియా జట్టు చాలా మందికి ఫేవరట్. ఇందులో భారతీయులు కూడా ఉంటారు. అదే లిస్ట్‌లోకి వస్తాడు మన టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Junior NTR). వైరల్‌గా మారిన వీడియో: 2023 ప్రపంచకప్(World Cup)లో ఇండియా(India)పై ఫైనల్లో గెలిచిన ఆస్ట్రేలియా(Australia) మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. వరల్డ్‌కప్ టైటిల్‌ను ఆరోసారి గెలుచుకుంది. దీంతో ఆస్ట్రేలియా టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సొంతగడ్డపై భారత్‌ను ఓడించి కప్ గెలవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అటు సోషల్‌మీడియాలో ఆస్ట్రేలియా జట్టును అభినందిస్తూ క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతుండగా.. జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. Well played Australia team in FINAL Match. pic.twitter.com/tMdlezgBCt — Hanu (@HanuNews) November 20, 2023 ఈ వీడియో చూస్తే అది పాతదని క్లియర్‌గా అర్థమవుతోంది. మీడియా సంస్థ 'ABN'లో జరిగే ఓ షోలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రొగ్రెమ్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. తనకు ఆస్ట్రేలియ టీమ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. తాను క్రికెట్ చూసినప్పటి నుంచి ఎంతో స్పోరిటీవ్గా ఆడే టీమ్ ఆస్ట్రేలియా అని.. అందుకే ఆ టీమ్‌తో తాను కనెక్ట్ ఐపోయినట్లు చెప్పారు. ఓ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చేసిన ఈ ట్వీట్‌కు వ్యూస్‌తో లైక్స్, రీట్వీట్స్ కూడా పోటెత్తుతున్నాయి. Also Read: ఆ క్రికెటర్ కూతురుపై అసభ్యకర పోస్టులు.. ఇచ్చిపడేసిన స్టార్ ప్లేయర్ భార్య! WATCH: #cricket-news #cricket #icc-world-cup-2023 #junior-ntr #india-vs-australia సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి