IND VS AUS: భారతీయులు ప్రార్థిస్తున్నది ఇద్దర్నే.. ఒకరు బౌలర్లు, రెండోది దేవుడిని!

మోదీ స్టేడియంలో జరుగుతున్న వన్డే ప్రపంచ్‌కప్‌ ఫైనల్‌లో టీమిండియా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

New Update
IND VS AUS: భారతీయులు  ప్రార్థిస్తున్నది ఇద్దర్నే.. ఒకరు బౌలర్లు, రెండోది దేవుడిని!

భారత్‌ అభిమానులు అతిగా ఆశపడ్డారు. ఆస్ట్రేలియాను కూడా లైట్ తీసుకున్నారు. పది మ్యాచ్ లు గెలిచాం.. గ్రూప్‌ స్టేజీలో ఆస్ట్రేలియాను ఓడించాం.. ఇంకేముంది.. ఫైనల్‌లో కూడా బ్యాటర్లు అదరగొడతారని అంతా భావించారు. రెండు రోజులుగా కాలర్ ఎగరవేశారు.. అదే పని మన టీమిండియా కూడా చేసింది. ఇప్పుడు ఆస్ట్రేలియా మైండ్ గేమ్ లో చిక్కుకుపోయింది.. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యుషన్ ఎ పోటీకైనా తప్పవు.. ఆస్ట్రేలియా మరోసారి సరైన ప్లానింగ్ చేసింది. ఒకవైపు భారత్ ను రెచ్చగొట్టింది.. మరోవైపు తాను చేయాలనుకున్నది చేసింది..

మంచి స్టార్ట్.. తర్వాత బోల్తా:

వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో తడపడింది. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. 50 ఓవర్లలో భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఓపెనర్‌ రోహిత్ శర్మ అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చాడు. వేగంగా పరుగులు చేశాడు. రోహిత్ శర్మ బౌండరీలతో రెచ్చిపోయాడు. మరో ఎండ్‌లో గిల్‌ ఔటైనా రోహిత్ ఫోర్లు, సిక్సులు కొట్టడంతో స్టేడియంలో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మరో ఎండ్‌లో కోహ్లీ కూడా వరుస ఫోర్లలతో అలరించాడు. దీంతో స్టేడియంలో ఫ్యాన్స్‌ కేరింతలు కొట్టారు. అర్థసెంచరీ వైపు అడుగులు వేస్తున్న రోహిత్‌ 47 రన్స్ వద్ద ఔట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో రోహిత్ లాఫ్ట్ చేయగా.. హెడ్‌ బ్యాక్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లి మరి క్యాచ్‌ అందుకోవడంతో రోహిత్ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అయ్యర్ నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ ఐపోయింది. వరుసగా రెండు వికెట్లు పడడంతో కోహ్లీ, తర్వాత వచ్చిన రాహుల్‌ కూడా డిఫెన్స్‌లో పడిపోయారు. అసలు బౌండరీ కూడా కొట్టలేకపోయారు. దాదాపు 88 బంతులు దాటినా బౌండరీ వెళ్లలేదు. అటు రాహుల్ స్లోగా ఆడినా.. కోహ్లీ మాత్రం స్ట్రైక్ రొటేట్ చేస్తూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అయ్యర్ నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ ఐపోయింది. వరుసగా రెండు వికెట్లు పడడంతో కోహ్లీ, తర్వాత వచ్చిన రాహుల్‌ కూడా డిఫెన్స్‌లో పడిపోయారు. అసలు బౌండరీ కూడా కొట్టలేకపోయారు. దాదాపు 88 బంతులు దాటినా బౌండరీ వెళ్లలేదు. అటు రాహుల్ స్లోగా ఆడినా.. కోహ్లీ మాత్రం స్ట్రైక్ రొటేట్ చేస్తూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వెంటనే కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు కోహ్లీ. 63 బంతుల్లో 54 పరుగులు చేసిన కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.

మరో ఎండ్‌లో రాహుల్‌ స్లోగా ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 109 బంతుల్లో 66 రన్స్ చేసిన రాహుల్ ఔట్ అయ్యాడు. తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ చెత్తగా బ్యాటింగ్‌ చేశాడు. బౌలర్లకు స్టైక్ ఇస్తూ టీమిండియాను దెబ్బకొట్టాడు. చివరకు 50 ఓవర్లలో భారత్‌ 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ALSO READ: మోదీ స్టేడియంలో భద్రతా ఉల్లంఘన.. కోహ్లీపై దూసుకొచ్చిన పాలస్తీనా సపోర్టర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు