Cricket: ఆ క్రికెటర్‌ కూతురుపై అసభ్యకర పోస్టులు.. ఇచ్చిపడేసిన స్టార్‌ ప్లేయర్ భార్య!

వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా బ్యాటర్‌ హెడ్‌ చెలరేగిన విషయంతెలిసిందే. దీంతో హెడ్‌ భార్య, ఏడాది వయసున్న కూతురుపై కొందరు అసభ్యకర కామెంట్స్ చేశారు. అటు మ్యాక్స్‌వెల్ భార్యను సైతం ట్రోల్ చేశారు. దీంతో ఇన్‌స్టా వేదికగా మ్యాక్సీ భార్య వినీ ట్రోలర్స్‌పై రివర్స్‌ అటాక్‌కు దిగారు.

New Update
Cricket: ఆ క్రికెటర్‌ కూతురుపై అసభ్యకర పోస్టులు.. ఇచ్చిపడేసిన స్టార్‌ ప్లేయర్ భార్య!

ICC WORLD CUP 2023: ఓడిపోతే ఎబ్యూజ్ చేస్తారా? సోషల్‌మీడియాలో నీతిమాలిన మంద పెరిగిపోతోంది. క్రికెటర్లు చాలా హూందాగా ఉంటారు కానీ.. కొంతమంది అభిమానులు మాత్రం దానికి రివర్స్‌లో ఉంటారు. పేరుకే క్రికెట్‌ ఫ్యాన్స్‌ అని చెప్పుకుంటారు కానీ ప్రవర్తించే తీరుమాత్రం ఉగ్రవాదులను పోలి ఉంటుంది. గతంలో కోహ్లీ సరిగ్గా ఆడలేదని ఓ వ్యక్తి విరాట్‌ కూతురుపై ఘోరమైన కామెంట్స్ చేశాడు. ఇలా పైశాచిక పోస్టులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గడంలేదు. వేరే ఎవరో పనిగట్టుకోని క్రియేట్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనుకుంటే పొరపాటే. క్రికెటర్ల భార్యలను, పిల్లలను రేప్ చేస్తామంటూ కామెంట్స్ చేసిన వారు తర్వాత అరెస్ట్ కూడా అవుతున్నారు. అయినా బుద్ధి రావడం లేదు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సైకో ఫ్యాన్స్‌ కొందరు ఆస్ట్రేలియన్ల క్రికెటర్ల ఫ్యామిలీని టార్గెట్ చేశారు.


రేప్ చేస్తాం:
వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో హెడ్‌ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ఇండియా ఓటమికి హెడ్‌ కారణమంటూ కొందరు సోషల్‌మీడియాలో ఓవర్‌ చేశారు. మరికొంతమంది లిమిట్‌ క్రాస్‌ చేశారు. ట్రావిస్ హెడ్ భార్య, కుమార్తెపై అడ్డగోల పోస్టులు పెట్టారు. హెడ్ భార్య, కుమార్తెకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలపై దాడి చేశారు. రేప్ బెదిరింపులకు గురి చేశారు. హెడ్‌ కుమార్తే వయసు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే.

View this post on Instagram

A post shared by Vini Maxwell (@vini.raman)


ఇండియానే సపోర్ట్ చేయాలంట:
మరోవైపు మ్యాక్స్‌వెల్‌ వైఫ్‌ భారత్‌ సంతతికి చెందిన మహిళ అని తెలిసిందే. మ్యాక్సీ భార్య పేరు వినీ రామన్. చిన్నతనం నుంచి ఆమె ఆస్ట్రేలియాలోనే పెరిగారు. అక్కడే మ్యాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇక ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఆమె కంగారులకు మద్దతు పలికారు. దీంతో ఆమెపై కొంతమంది అతిగాళ్లు విరుచుకుపడ్డారు. భర్త కోసం సొంతదేశాన్ని సపోర్ట్ చేయకుండా వదిలేస్తావా అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడారు. వీరందరికి ఇచ్చిపడేసింది వినీ. తన భర్త టీమ్‌కు మద్దతు ఇచ్చినందుకు తాను ఎదుర్కొన్న క్రూరమైన ట్రోలింగ్‌ను బయటపెట్టింది. అదే సమయంలో తాను చేసింది అసలు తప్పు ఎలా అవుతుందో తెలియదంటూ ట్రోలర్స్‌కు చురకలంటించింది. ఇక ప్రత్యర్థి ఆటగాళ్ల కుటుంబాలను అభిమానులు అన్యాయంగా టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. జాగ్రత్తగా పర్యవేక్షించాలని, కఠినమైన చట్టాలను అమలు చేయాలని ట్రూ స్పోర్ట్స్‌ లవర్స్‌ డిమాండ్ చేస్తున్నారు.

Also Read: అతి జాగ్రత్తే కొంపముంచింది.. ఇండియా చేసిన ఐదు తప్పిదాలివే!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు