IND VS AUS: లక్షా 30 వేల మందికి ఆసీస్ కెప్టెన్‌ సవాల్‌.. ఏం అన్నాడో తెలిస్తే షాక్‌ అవుతారు!

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌ ఫైట్‌ లక్షా 30వేల మంది అభిమానుల సమక్షంలో జరగనుంది. చుట్టూ అంత మంది భారత్‌కు సపోర్ట్ చేస్తున్నా.. తామే గెలుస్తాం అంటున్నాడు ఆసీస్‌ కెప్టెన్‌ కమ్మిన్స్‌. లక్షల మందిని సైలెంట్‌గా ఉండేలా చేయడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదని చెబుతున్నాడు.

New Update
IND VS AUS: లక్షా 30 వేల మందికి ఆసీస్ కెప్టెన్‌ సవాల్‌.. ఏం అన్నాడో తెలిస్తే షాక్‌ అవుతారు!

ICC WORLD CUP 2023: 'నెవెర్ గివ్ అప్' అనే పదం క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు సరిగ్గా సరిపోతుంది. ఎన్నిసార్లు కిందపడినా.. కిందకేసి తొక్కినా ఆస్ట్రేలియా పైకి లేస్తూనే ఉంటుంది. చివరి వరకు పోరాడడం ఆ జట్టు నైజం. అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఆట చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. టోర్నిలో పడుతూ లేస్తూ వచ్చిన ఆసీస్‌ కీలక మ్యాచ్‌ల్లో సత్తా చాటి సెమీస్‌.. ఆ తర్వాత ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకప్పటితో పోల్చితే ఆసీస్‌ అంత బలమైన జట్టు కాకున్నా వారిని తక్కువ అంచనా వేస్తే బొక్కబోర్ల పడడం ఖాయం. ఇటు హోం గ్రౌండ్‌లో ఆడడం ఇండియాకు అడ్వాన్‌టేజ్‌గా మారగా.. ఆసీస్‌ మాత్రం ఏ గడ్డపైనైనా గెలుస్తామన్న ధీమాగా ఉంది.


అందరిని సైలెన్స్ చేస్తాం:
మరోవైపు రేపు(నవంబర్‌ 19) అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో ఫైనల్‌ జరగనుండగా.. ఈ గ్రౌండ్‌ ప్రపంచంలో అతి పెద్ద సీటింగ్‌ కెపాసిటీ ఉన్న గ్రౌండ్‌. లక్షా 30వేలకు పైగా సీటింగ్‌ కెపాసిటీ ఉన్న ఈ గ్రౌండ్‌లో మ్యాచ్‌ జరగనుండడంతో అక్కడున్నవారంతా ఎలాగో ఇండియాకే సపోర్ట్ చేస్తారన్న విషయం తమకు తెలుసంటున్నాడు ఆసీస్‌ కెప్టెన్ కమ్మిన్స్‌. అయితే లక్షా 30వేల మందిని నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే తమ లక్ష్యమన్నాడు. లక్షల మందిని సైలెంట్‌గా ఉండేలా చేయడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదని చెబుతున్నాడు. అంటే గెలిచేది మేమనన్న విశ్వాసం కమ్మిన్స్‌ మాటల్లో కనిపిస్తోంది.

అయితే కమ్మిన్స్ చెప్పినంత ఈజీ కాదు ఇండియాపై గెలవడం అంటున్నారు విశ్లేషకులు. ఈ వరల్డ్‌కప్‌లో ఇండియా సాధించిన విజయాలు చూస్తే అసలు భారత్‌ను ఓడించడం అన్నిటికంటే అతికష్టమైన విషయమని అంటున్నారు. గ్రూప్‌ స్టేజీ నుంచి సెమీస్‌ వరకు ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని భారత్‌ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ దుమ్ములేపుతోంది. అందరూ భారీ స్కోరు సమర్పించుకుంటున్న పిచ్‌లపై భారత్‌ బౌలర్లు రాణించిన తీరు అద్బుతం. అటు గ్రూప్‌ స్టేజీలో ఇప్పటికే ఆస్ట్రేలియా ఇండియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

Also Read: షమీకి యోగి గిఫ్ట్.. ఊర్లో క్రికెట్ స్టేడియం… సీఎం నిర్ణయంతో ఆ గ్రామంలో పండుగ!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు