IND vs AUS: పిన్ డ్రాప్ సైలెన్స్.. స్టేడియాన్ని ఆవహించిన నిశ్శబ్దం..! మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా స్లోగా బ్యాటింగ్ చేస్తోంది. దీంతో బౌండరీ రావడమే గగనమైపోయింది. స్టేడియంలో లక్షా 30వేల మంది సైలెంట్‌గా ఉండిపోయారు. లక్షల మందిని సైలెన్స్‌గా ఉంచితే అంతకంటే వచ్చే సంతృప్తి అసలు ఉండదు అన్న కమ్మిన్స్ మాటలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. By Trinath 19 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి కమ్మిన్స్ నిన్న ఒక మాట చెప్పాడు.. లక్షా 30 వేల మందిని సైలెన్స్‌గా ఉంచితే అంతకంటే వచ్చే సంతృప్తి అసలు ఉండదు అని.. మోదీ స్టేడియంలో ఫైనల్ మొదలైన తర్వాత స్టేడియం హోరెత్తింది. రోహిత్ శర్మ బౌండరీలతో రెచ్చిపోయాడు. మరో ఎండ్‌లో గిల్ ఔటైనా రోహిత్ ఫోర్లు, సిక్సులు కొట్టడంతో స్టేడియంలో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మరో ఎండ్‌లో కోహ్లీ కూడా వరుస ఫోర్లలతో అలరించాడు. దీంతో స్టేడియంలో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. అర్థసెంచరీ వైపు అడుగులు వేస్తున్న రోహిత్ 47 రన్స్ వద్ద ఔట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో రోహిత్ లాఫ్ట్ చేయగా.. హెడ్ బ్యాక్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లి మరి క్యాచ్ అందుకోవడంతో రోహిత్ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అయ్యర్ నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ ఐపోయింది. వరుసగా రెండు వికెట్లు పడడంతో కోహ్లీ, తర్వాత వచ్చిన రాహుల్ కూడా డిఫెన్స్‌లో పడిపోయారు. అసలు బౌంబరీ కూడా కొట్టలేకపోయారు. దాదాపు 88 బంతులు దాటినా బౌండరీ వెళ్లలేదు. దీంతో స్టేడియంలో అందరూ సైలెంట్‌గా ఉండిపోయారు. ఎవరికి వారు పక్కనవారితో ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపించారు. అటు సచిన్ ఏమో అనురాగ్ థాకుర్‌కు ఏదో బ్యాటింగ్ గురించి ఎక్స్‌ప్లైన్ చేస్తున్నట్లు కనిపించగా.. అనుష్క శర్మ పక్కన వారితో స్లోగా మాట్లాడుతూ కనిపించింది. ఇలా స్టేడియం మొత్తం సైలెంట్ ఐపోయింది. కమ్మిన్స్ చెప్పింది కూడా ఇదే. Also Read: ప్చ్.. రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. ‘హెడ్’ పగిలే క్యాచ్ భయ్యా! #virat-kohli #rohit-sharma #india-vs-australia #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి