AUS vs BAN: బాబోయ్ ఆస్ట్రేలియా.. లాస్ట్‌ మ్యాచ్‌లోనూ ఉతికి ఆరేసిందిగా!

వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ను కన్ఫామ్‌ చేసుకున్న ఆసీస్‌ బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసీస్‌ బ్యాటర్‌ మిచెల్ మార్ష్‌ 132బంతుల్లోనే 177 రన్స్ చేశాడు.

New Update
AUS vs BAN: బాబోయ్ ఆస్ట్రేలియా.. లాస్ట్‌ మ్యాచ్‌లోనూ ఉతికి ఆరేసిందిగా!

'ఆస్ట్రేలియా ఫైనల్‌కు వస్తే అంతే సంగతి... ఆరోసారి ఆరేస్తారు.. రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికానే గెలవాలి..' ఇది సగటు టీమిండియా అభిమాని ఆందోళన. పోరాటాలకు, నెవర్‌గిప్‌కు మరోపేరుగా నిలిచే ఆస్ట్రేలియా ఈ వరల్డ్‌కప్‌లో అదరగొడుతోంది. తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లోనూ గెలిచింది. బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


అందరూ ఆకట్టుకున్నారు:
పూణే వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా బంగ్లా టైగర్స్‌ బ్యాటింగ్‌కు దిగారు. ఓపెనర్లు టన్జిద్‌ హసన్‌, లిట్టన్‌ దాస్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు తలో 36 పరుగులు చేశారు. 11.2 ఓవర్లలో 76 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 16.4 ఓవర్లలో 106 రన్స్ వద్ద బంగ్లాదేశ్‌ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లిద్దరూ ఔటైన తర్వాత కెప్టెన్ షంటోతో టౌహిద్‌ జత కలిశాడు. ఇద్దరు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. హాఫ్‌ సెంచరీ వైపు అడుగులు వేస్తున్న షంటో రన్‌అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మహ్మదుల్లా 28 బంతుల్లో 32 రన్స్ చేసి రన్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రహీమ్‌ సైతం 21 రన్స్‌కే అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో టౌహిద్‌ అద్భుతంగా ఆడాడు. 79 బంతుల్లో 74 రన్స్ చేసిన టౌహిద్‌ను స్టోయినిస్‌ అవుట్ చేశాడు. బంగ్లాదేశ్‌ 300 పరుగులు దాటుతుందానన్న అనుమానం కలిగింది కానీ.. చివరిలో మిరాజ్‌ 20 బంతుల్లోనే 29 రన్స్ చేయడంతో ఆ మార్క్‌ను దాటింది


మార్ష్‌ వారేవ్వా:
307 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ ఆరంభంలో దెబ్బ తగిలింది. ట్రావిస్‌ హెడ్‌ 10 రన్స్‌కే పెవిలియన్‌కు చేరాడు. టస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన మిచెల్ మార్ష్‌ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ఓపెనర్‌ వార్నర్‌ స్ట్రైక్‌ రొటేట్ చేస్తూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 22.1 ఓవర్లలో స్కోరు బోర్డు 132 వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది ఆస్ట్రేలియా. ముస్తాఫిజర్‌ బౌలింగ్‌లో వార్నర్‌ 53 రన్స్ వద్ద షంటోకి చిక్కి పెవిలియన్‌కు చేరాడు. అటు మిచెల్‌ మార్ష్‌ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఇక మరో ఎండ్‌లో స్టిమ్‌ స్మిత్‌ స్ట్రైక్‌ రొటేట్ చేస్తూ ఎక్కువగా స్ట్రైకింగ్‌ మార్ష్‌కే ఇచ్చాడు. ఈ క్రమంలోనే మార్ష్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయాడు మార్ష్. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అటు స్టీవ్‌ స్మిత్‌ హాఫ్‌ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక మార్ష్ వేగంగా ఆడడంతో ఆస్ట్రేలియా 44.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. 132 బంతుల్లో 177 రన్స్ చేసిన మార్ష్ నాటౌట్‌గా నిలిచాడు. మార్ష్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 9 సిక్సలు ఉన్నాయి. అటు 64 బాల్స్‌లో 63 రన్స్ చేశాడు స్మిత్‌. అతని ఇన్నింగ్స్‌లో ఒక సిక్సర్‌, నాలుగు ఫోర్లు ఉన్నాయి.

Also Read: దీపావళి రోజు పేలిన టీమిండియా టపాసులు.. మరిచిపోలేని జ్ఞాపకాలు..!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు