World cup 2023: మేం ఇక్కడ ఆడలేం బాబోయ్.. ఢిల్లీ కాలుష్యానికి స్టార్‌ క్రికెటర్లు ఉక్కిరిబిక్కిరి!

ఢిల్లీ కొన్నిరోజులుగా విషగాలి గుప్పెట్లో చిక్కుకుంది. దీంతో బంగ్లాదేశ్‌, శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టిస్‌ సెషన్‌ను రద్దు చేసుకున్నారు. నవంబర్‌ 6న అరుణ్‌ జైట్లీ స్టేడియంలో బంగ్లా వర్సెస్‌ శ్రీలంక మ్యాచ్‌ జరగనుంది. సెమీస్‌ రెస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌ శ్రీలంకకు ఎంతో కీలకం.

New Update
World cup 2023: మేం ఇక్కడ ఆడలేం బాబోయ్.. ఢిల్లీ కాలుష్యానికి స్టార్‌ క్రికెటర్లు ఉక్కిరిబిక్కిరి!

BAN VS SL: ఢిల్లీ(Delhi)లో ఘోరాతి ఘోరమైన పరిస్థితులు దాపరించాయి. అసలు గాలి పీల్చడమే శాపంగా మారిపోయింది. ఢిల్లీలో గాలి పీల్చడం వరుసగా సిగరెట్లు తాగడం రెండు ఒక్కటే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సామాన్యుల నుంచి స్టార్ క్రికెటర్ల వరుకు ప్రతీఒక్కరూ ఢిల్లీ కాలుష్యానికి ఎఫెక్ట్ అవుతున్నారు. అసలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ వరల్డ్‌కప్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 6న శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఢిల్లీలో జరగనుంది. ఈ మ్యాచ్‌ ప్రాక్టిస్‌ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు గ్రౌండ్‌కు వచ్చారు. అయితే ఎయిర్‌ పొలూష్యన్‌(Air Pollution)ను చూసి షాక్‌ అయిన క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేయలేమంటూ వెళ్లిపోయారు.


నిన్న బంగ్లా.. నేడు శ్రీలంక:
ఢిల్లీలో విషపూరిత పొగమంచు కారణంగా శ్రీలంక(Srilanka) తమ ప్రాక్టిస్‌ సెషన్‌ను రద్దు చేసుకుంది. నిన్న(నవంబర్‌ 03)న బంగ్లాదేశ్‌ జట్టు కూడా ఇదే కారణంతో ప్రాక్టిస్‌ను క్యాన్సిల్ చేసుకుంది. ఢిల్లీ ఎయిర్‌ క్వాలిటి ఇండెక్స్‌ ప్రస్తుతం 640 పాయింట్ల వద్ద ఉంది. నిన్న జరగాల్సిన జట్టు ప్రాక్టిస్‌ సెషన్‌ను రద్దు చేయడంపై బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఆటగాళ్లకు ఇప్పటికే దగ్గు మొదలైందని, కాబట్టి మ్యాచ్‌కు ముందు రిస్క్ తీసుకోవాలని భావించడం లేదన్నారు ఖలీద్. అరుణ్ జైట్లీ స్టేడియం వెలుపల ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నంలో ఉంది. ట్రక్కు నిండా మౌంటెడ్ వాటర్ స్ప్రింక్లర్‌లను తీసుకెళ్తోంది.


శ్రీలంకకు కీలకం:
జరగనున్న మ్యాచ్‌ శ్రీలంకకు ఎంతో ముఖ్యం. ఇప్పటికే సెమీస్‌ రేస్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్ అయ్యింది. ఇటు శ్రీలంక పరిస్థితి కూడా ఏ మాత్రం గొప్పగా లేదు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఓడిపోతే శ్రీలంక కూడా సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించినట్లే. అందుకే ఈ మ్యాచ్‌ గెలవడం శ్రీలంకకు నీడ్. అయితే కీలకమైన మ్యాచ్‌కు శ్రీలంకకు ప్రాక్టిస్‌ చేసుకునే అవకాశం లేకుండా పోవడం పట్ల ఆ జట్టు అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. శ్రీలంక కంటే మెరుగైన పొజిషన్‌లో పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ ఉన్నాయి. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో శ్రీలంక గెలవడంతో పాటు మిగిలిన జట్ల ఓటములపై లంకేయుల సెమీస్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Also Read: వాతావరణ కాలుష్యం ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడు గాలి విషంగా మారుతుంది? 

Watch: 

Advertisment
Advertisment
తాజా కథనాలు