Yuvraj Dhoni: నేను కెప్టెన్ కావాల్సింది.. ధోనీ నాకు క్లోజ్ కాదు.. యువరాజ్ సంచలన వ్యాఖ్యలు! గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో తన సహచరులతో కలిసి నిలబడినందుకు బీసీసీఐ అధికారుల్లో కొందరు తనను వ్యతిరేకించారని.. అందుకే తనను కాకుండా ధోనీకి కెప్టెన్సీ అవకాశం వచ్చినట్లు చెప్పాడు యువీ. ధోనీతో తనకు క్లోజ్ ఫ్రెండ్‌షిప్ లేదని చెప్పుకొచ్చాడు. By Trinath 05 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి యువరాజ్-ధోనీ.. ఈ ఇద్దరి కాంబో గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు కలిసి టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించారు. ధోనీ ఖాతాలో ఉన్న రెండు టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్‌లకు యువీనే కారణం. వరల్డ్‌కప్‌ల్లో ఇండియా యువీ ప్రత్యేకం. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్‌లో యువరాజ్ ఆటను ఎవరూ మర్చిపోలేరు. 2011 ప్రపంచకప్‌లో బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ మెరిసిన యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్‌కప్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే క్యాన్సర్ బారిన పడడం అతని కెరీర్‌ను మధ్యలోనే దెబ్బతీసిందని చెప్పవచ్చు. ఇక అన్‌ఫీల్డ్‌లో ధోనీ-యువీ చాలా క్లోజ్‌గా ఉంటారు. కానీ ఆఫ్‌ఫీల్డ్‌లో మాత్రం తామిద్దరు అంత క్లోజ్ కాదంటున్నాడు యువరాజ్. యువరాజ్ ఏం అన్నాడంటే: 'మీ సహచరులు ఫీల్డ్ వెలుపల మీకు మంచి స్నేహితులుగా ఉండవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి భిన్నమైన జీవనశైలి, నైపుణ్యం ఉంటుంది. కొంతమంది వ్యక్తులు నిర్దిష్ట వ్యక్తులతో సమావేశమవుతారు, మీరు మైదానంలోకి వెళ్లడానికి అందరితో మంచి స్నేహితులుగా ఉండవలసిన అవసరం లేదు.' అంటూ యువీ కామెంట్స్ చేశాడు. అంతేకాదు ధోనీ సెంచరీ కోసం తాను సపోర్ట్ చేసినట్టే.. తన 50 కోసం కూడా ధోనీ సపోర్ట్ చేశాడని చెప్పుకొచ్చాడు. గ్రౌండ్‌లో ఇద్దరం ప్రొషెషనల్‌గా ఉండేవారిమని చెప్పాడు. తన రిటైర్‌మెంట్‌కు ముందు ధోనీని సలహా అడిగినట్లు చెప్పాడు యువీ. సెలక్టర్లు తన గురించి ఆలోచించడం లేదని ధోనీనే క్లారిటీ ఇచ్చినట్లు తెలిపాడు. 'నేనూ, మహి క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. క్రికెట్ కారణంగా మేం స్నేహితులం, కలిసి ఆడాం. మహి లైఫ్ స్టైల్ నాకు చాలా డిఫరెంట్, అందుకే మేం ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్స్ కాలేదు, క్రికెట్ వల్ల మేం స్నేహితులం.' అని చెప్పాడు యువీ. నేను కెప్టెన్ కావాల్సింది: 2007 వన్డే వరల్డ్‌కప్ ఓటమి తర్వాత ద్రవిడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అదే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ముందు కొత్త సారధి కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోకి ధోనీ కంటే ముందు వచ్చిన యువరాజ్, సెహ్వాగ్‌ను కాకుండా మహేంద్రుడికి సారధ్య బాధ్యతలు అప్పగించింది. సచిన్ సలహాతో ఇది జరిగింది. నిజానికి యువరాజ్ కెప్టెన్ కావాలి. అయితే గ్రేగ్ ఛాపెల్ కోచ్‌గా ఉన్న టైమ్‌లో వచ్చిన ఇష్యూస్ కారణంగా తనపై బ్యాడ్ ముద్రపడిందని.. అందుకే తనకు అవకాశం రాలేదని చెప్పుకొచ్చాడు యువరాజ్. తనను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించడానికి కూడా అదే కారణమని జియో సినిమాలో సంజయ్ మంజ్రేకర్‌తో చెప్పాడు యువీ. Also Read: ‘మేం చోకర్స్ అయితే ఇండియా ఏంటి’? తిక్క కుదిర్చిన దక్షిణాఫ్రికా కెప్టెన్..! #cricket #yuvraj-singh #dhoni #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి