Dubai: భారత్, యూఏఈ జిందాబాద్.. దుబాయ్ లో మోడీ ప్రసంగం

భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ వేదికగా తెలుగు, తమిళం, మళయాళంలో మాట్లాడారు. 30 ఏళ్లలో యూఏఈలో పర్యటించిన తొలి ప్రధాని తానే అని చెప్పారు. ఇక్కడున్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

New Update
Dubai: భారత్, యూఏఈ జిందాబాద్.. దుబాయ్ లో మోడీ ప్రసంగం

Narendra Modi at Ahlan Modi event in UAE: నరేంద్ర మోడీ మంగళవారం రెండు రోజుల పర్యటన కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మోడీకి సాదర స్వాగతం పలికారు అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. ఇద్దరు నేతలు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అనంతరం ఆయనకు గౌరవ వందనం అందించారు. ఇరువురు నేతలు విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించారు. కొత్త సహకార రంగాలపై చర్చించారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

యూఏఈలో పర్యటించిన తొలి ప్రధాని..
ఈ సందర్భంగా అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో మొదట తెలుగు, తమిళం మళయాళంలో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. 30 ఏళ్లలో యూఏఈలో పర్యటించిన తొలి ప్రధాని (first pm) తానే అని చెప్పారు. ఇక్కడున్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు. యూఏఈ అత్యున్నత పురష్కారం తనకు లభించిందంటే అది మీ వల్లే అని భారతీయులపై ప్రశంసలు కురిపించారు. యూఏఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చినపుడు ఆయనను గౌరవించామని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి : AP: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి నెల్లూరు పెద్దారెడ్లు బై బై..!

అల్ నహ్యాన్ కు కృతజ్ఞతలు..
దేశంలో మొట్టమొదటి హిందూ రాతి దేవాలయం నిర్మాణానికి భూమిని మంజూరు చేయడంలో మద్దతు, దయ చూపినందుకు అల్ నహ్యాన్ కు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం అబుదాబిలో బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌ను మోడీ ప్రారంభించారు. దుబాయ్‌లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో మోదీ గౌరవ అతిథిగా పాల్గొంటారు. అక్కడ ఆయన కీలక ప్రసంగం చేస్తారు. మోడీ UAE పర్యటన 2015 నుంచి ఇది ఏడవసారి. కాగా గత ఎనిమిది నెలల్లో ఇది అతని మూడవ పర్యటన.

Also Read: రైతులకు ఇబ్బంది కలిగించారో !.. రాకేష్ టికైత్ హెచ్చరిక

Advertisment
Advertisment
తాజా కథనాలు