/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-1-9.jpg)
Hydra Ranganath: చెరవులను ఆక్రమించిన నిర్మాణాలపై హైడ్రా దూకుడు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు పేద, మధ్య తరగతి ప్రజలు వివిధ ప్రాంతాల్లో బఫర్ జోన్‌లలో నిర్మించి ఉన్న ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. దీంతో తమ ఇళ్లు కూడా కూలుస్తారని భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయబోయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రజలు నివాసం ఉంటున్న గృహాలను కూల్చివేయమని స్పష్టం చేశారు.
Also Read: హైడ్రా దూకుడు.. ఈరోజు కూల్చేది వాళ్లదే!