TG : దూకుడు పెంచిన హైడ్రా.. నిన్న ఫిర్యాదు.. ఇవాళ కూల్చివేత..!

హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు పెంచింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పర్యవేక్షించిన 48 గంటల్లోనే మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేతలు చేపట్టారు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. రాంనగర్‌లో నాలా, డ్రైనేజీలపై నిర్మాణాలు చేసినట్లు గుర్తించింది.

New Update
TG : దూకుడు పెంచిన హైడ్రా.. నిన్న ఫిర్యాదు.. ఇవాళ కూల్చివేత..!

Hyderabad : హైదరాబాద్‌లో హైడ్రా (HYDRA) మరింత దూకుడు పెంచింది. ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది. రాంనగర్‌ (Ramnagar) లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

Also Read: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి లడ్డూపై ఆంక్షలు..!

రాంనగర్‌లో నాలా, డ్రైనేజీలపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ నిన్న పర్యవేక్షించి.. నాలా, డ్రైనేజీలపై అక్రమంగా భవనాలు నిర్మించారని గుర్తించారు.  48 గంటల్లోనే అక్రమ కట్టడాలను అధికారులు జేసీబీలతో కూల్చివేతలు మొదలు పెట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు