HYDRA: అప్పటివరకు కూల్చివేతలకు బ్రేక్.. కారణమిదే!

భారీ వర్షాల నేపథ్యంలో కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చింది హైడ్రా. హైడ్రా అధికారులంతా ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చెరువుల చుట్టుపక్కల కాలనీల్లో పర్యటిస్తూ నీట మునిగిన ప్రాంతాలను మార్క్ చేస్తున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది.

New Update
HYDRA: అప్పటివరకు కూల్చివేతలకు బ్రేక్.. కారణమిదే!

Hyderabad: అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు రేపిన హైడ్రా ప్రస్తుతం కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చింది. గత రెండురోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాలు జలమయం కాగా.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. హైదరాబాద్‌లోనూ వర్ష బీభత్సం సృష్టిస్తుండగా హైడ్రా టీమ్ మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

మాన్సూన్ సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు..
ఈ మేరకు గ్రేటర్ పరిధిలో మాన్సూన్ సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు పాల్గొంటున్నాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సైత రంగంలోకి దిగి వాటర్ లాగిన్ పాయింట్స్, లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కాలనీలు నీట మునిగేందుకు గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా చెరువుల చుట్టుపక్కల కాలనీల్లో పరిస్థితిని సమీక్షిస్తూ నీటి శాతం చూసి ఆయా ప్రాంతాలను మార్క్ చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత జలమయం అయిన ప్రాంతాలకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు నోటీసులు ఇవ్వగా మరికొన్ని ప్రాంతాలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నోటీసులు అందినవారు వారం రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. హైడ్రా హెచ్ఎండీఏ పరిధిలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ తోపాటు 200కు పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఇక చట్ట ముందు అందరూ సమానమేనని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేయగా.. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు, ఆఫీసుకు నోటీసులు అందజేశారు. వర్షాలు తగ్గిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజీ, కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు